Sunday, September 6, 2020

శివోహం

తండ్రీ శివప్పా

నీవు 
మొదలెట్టిన
నీ భిక్షతో  మురిసిపోతున్నాను 

నీ  
ప్రసాదాన్ని 
కళ్ళకద్దుకుని మెరిసిపోతున్నాను 

శివోహం  శివోహం

శివోహం

ఎన్ని 
దశలు తొలగినా 
మరెన్ని 
దిశలు తిరిగినా 

నా
దశ మారేనా 
నీ 
దిశ వైపు మరలేనా తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఏడుపుతో 
తొలి యాత్ర  
ఏడుపులతో  
తుది యాత్ర 

జీవితం అంటే 
ఇంతేనా ?
మరి 
నీ గురించిన ఆలోచనలు ??

" ఎప్పుడు తండ్రీ "  ???

శివోహం  శివోహం

శివోహం

శంభో!!!నా దారి నీ దరికే కాదా 
ఈ దాసుడు నీ దివ్యచరణాల సేవకే కాదా   
నా అడుగడుగు వడివడిగా నీ  కొండకే కాదా
నా మదిహృది నిన్ను తలుచుటకే కాదా
నా అణువణువు నీ ఆరాధనకే కాదా 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నాల్గుముఖముల వాడు నింగిలో వెదకినా,
నాభి కమలము వాడు నేల తవ్వి వెదకినా
అంతు చిక్కనే లేదు నీ ఆద్యంత మెచటో
మహేశా . . . . .  శరణు .

శివోహం

అణువణువు వెలసిన దేవదేవుడు నీవు...

ప్రపంచమంతటికి నీవే మూలం...
నీ నీడనే యీ సమస్తం అంతా  ...

మా సమస్తమంతా నీకే అర్పితం ... 
మా మస్తకములందు నీ స్మరణ నృత్యమాడాలి ఈశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఆది మధ్య అంతం లేనివాడు...
బ్రహ్మ విష్ణు మహేశ్వర నిత్య పూజలందుకునే దేవదేవుడు...
ఉదయ మధ్యాహ్న సాయంకాల సూర్యుడిలా...
రేతిరి వేళ వెన్నెలు కురిపించే నెలరాజులా...
అన్నీ తానే అయి మనలను కాపాడే గణనాథుడు...

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...