Wednesday, September 9, 2020

శివోహం

శిథిలమై పోయే
శరీరం కన్నా 

నీ కొండ కోనల్లో
నీ పాద రేణువుల్లో

శివునిగా మారిపోయే
శిలాజాలమే మిన్న తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివుడు అంటేనే
ఒక మహా యజ్ఞం

ఆ యజ్ఞ వాటికలో
మిగిలేది చివరకు భస్మమే

పొందుతావో
పారిపోతావో నీ అభీష్టం మిత్రమా

శివోహం  శివోహం

Tuesday, September 8, 2020

శివోహం

దేహమను క్షేత్రంలో భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు ప్రేమ అను జలాభిషేకమును
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును 
ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు

Monday, September 7, 2020

శివోహం

శివుని ఆనా లేనిదే చీమైనా కుట్టదు...
భవుని పిలుపు రానిదే భవ బంధం వీడదు...
అత్మ శుద్ధి కొసమె ఆ దేవుని శోధన...
అయిన వీడదు ఎపుడు ఈ జీవుని వేదన...
ఈ  దెహము ఈ  ప్రాణము ఈ జీవితము...
పరమా శివుని పాదములకు అది అంకితము...
మహాదేవా శంభో శరణు...

శివోహం

సంతోషపు సముద్రపు అంచున
ఆనందపు ఉశోదయాలు...

విషాదపు కొండల నడుమన
అస్తమిస్తున్న కష్టాలు.....

ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ రోజు గడిస్తే చాలని....

మరోమారు అనిపిస్తుంది ఇలాంటి రోజుల్లో ఉండకూడదని....

నిన్ను తెలియ గోరితే నిమిషంలో కరుణిస్తావంటగా...
నీ శరణు పొందితే చేయిపట్టి నడిపిస్తావంటగా...
సదా నిన్ను భజియిస్తే అమ్మగా లాలిస్తావటగా....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

శంభో నీ కంఠంలో విషం లీనమయ్యింది..
అది మా కంటికి నీలం అయ్యింది..
నీ నీలకంఠాన్ని చూస్తూ నీలో లీనమైపోనీ...
మహాదేవా శంభో శరణు...

Sunday, September 6, 2020

శివోహం

ధార పోసేవాడు
గురువు అవుతాడు కానీ ?

ఆ ధారలనే
గురు దక్షిణగా ??

తీసుకునే వాడు
గురువు ఎలా అవుతాడు ???

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...