Saturday, September 12, 2020

శివోహం

వేలవేల దండాలు నీకు వేంకటేశ్వరా
నీ అండదండలే  చాలు మాకు శ్రీకరా

ఏమి కోరవచ్చునో తెలియకున్నది
నా కోరికలకు అంతమేమి కానకున్నది
కోరాలన్న  తలపు కాస్త తృంచివేయుమా
అరుదైన ఆ స్దితిలో నన్ను స్థిరముగానుంచుమా

పదే పదే నీ కొండ చేర భాగ్యమె అయినా
నాలోనే నిను  చూచు దివ్య భాగ్యమునిడుమా
ఉన్న చోట ఉండనీయి సదా నిన్న చూడనీయి
నన్ను గడప దాటనీయకు నీవు నా కన్ను దాటకు

ఫలాపేక్షతో నేను పలు జన్మలు చూసాను
గతము గుర్తు లేకున్నా హితమేదో కాకున్నా
జనన మరణ చక్రంలో బంధీగా పడివున్నా
ఆ బంధాలు త్రెంచవయ్యా బుద్ధునిగా చేయవయ్యా

హనుమాన్

ఎంతటి అసాధ్యమైన పనినైనా సాదించగలిగిన శక్తి ఉన్నవాడవు...
నీకు అసాధ్యంకానిది ఎమున్నది లోకంలో...
రామునికి దూతగా వెళ్ళి రావణుణ్ణి వధించినవాడవు...
సీతమ్మ విషయంలో సరైన తీరులో ప్రవర్తించినవాడవు...
చెప్పలేనంత జాలిగుణం ఉన్నవాడవు నీవు...
అయినా నీకు నే ననుకొంటున్న పని నాకు సాదించి పెట్టడం ఓ కష్టమవుతుందా హనుమా..
కా బట్టి ఆ పనిని సాధించిపెట్టు స్వామి..

రామ బంటువు నివయ్య...ని బంటును నేనయ్య...

Friday, September 11, 2020

శివోహం

ఈ ప్రపంచమంతా డొల్లతనం తో ఉంది
ఏది పొందితే ఇంద్రియ సుఖాలు వస్తాయో అవన్నీ డొల్ల...

ఇది తెలుసుకో..

ఇవన్నీ మానవజన్మని పాడుచేస్తాయి...

భగవంతుడిని పట్టుకుంటే తప్ప ఇంద్రియాలు లొంగవు
భగవంతుడిలో భేదాలు లేవు...

పవిత్రమైన పూజలు చేస్తూ, పవిత్రమైన భావాలు ప్రదర్శిస్తూ అన్నం పెట్టడానికి జంకేవారు ఫలితాన్ని పొందలేరు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఏ కోరికల కట్టెలనైనా ?
ఇక్కడే కాల్చేస్తున్నావు ??

నిస్సహాయున్ని తండ్రీ ???

ఏ నిచ్చెనలు వేయాలి ?
నీ కైలాసాన్ని చేరుకోవడానికి ??

శివోహం  శివోహం

శివోహం

శివా!కొర్కెల నిచ్చెనలను కూల్చాలి
భక్తి ,జ్ఞాన,వైరాగ్య మెట్లను ఎక్కాలి
గమ్యం చేరాలి నీ ఆసరా కావాలి 
మహేశా . . . . . శరణు .

Thursday, September 10, 2020

శివోహం

శివా!వ్యవహార పరంగా ద్వైతం
నువ్వు.... నేను
తత్వ పరంగా అద్వైతం 
అందుకే  నువ్వే ...నేను
మహేశా . . . . . శరణు .

శివోహం

అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశల పాశాలను తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం....
వైరాగ్యం పదునైన కత్తి ఒక్కటే....
శివ నామ స్మరణ...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...