Saturday, September 12, 2020

శివోహం

వేలవేల దండాలు నీకు వేంకటేశ్వరా
నీ అండదండలే  చాలు మాకు శ్రీకరా

ఏమి కోరవచ్చునో తెలియకున్నది
నా కోరికలకు అంతమేమి కానకున్నది
కోరాలన్న  తలపు కాస్త తృంచివేయుమా
అరుదైన ఆ స్దితిలో నన్ను స్థిరముగానుంచుమా

పదే పదే నీ కొండ చేర భాగ్యమె అయినా
నాలోనే నిను  చూచు దివ్య భాగ్యమునిడుమా
ఉన్న చోట ఉండనీయి సదా నిన్న చూడనీయి
నన్ను గడప దాటనీయకు నీవు నా కన్ను దాటకు

ఫలాపేక్షతో నేను పలు జన్మలు చూసాను
గతము గుర్తు లేకున్నా హితమేదో కాకున్నా
జనన మరణ చక్రంలో బంధీగా పడివున్నా
ఆ బంధాలు త్రెంచవయ్యా బుద్ధునిగా చేయవయ్యా

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...