Wednesday, September 16, 2020

శివోహం

ఇష్టం ఉన్నంత వరకు కొందరు...
కష్టం కలగనంత వరకు కొందరు...
కన్ను మూసే వరకు కొందరు...
కట్టే కాలెంత వరకు కొందరు...
కొంత కాలమే ఎవ్వరైనా...
కడకు నిలిచేది మన బంధమే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .

శివోహం

రారా అనరా శివ...
నన్ను నోరరా రారా అనరా శివ...

నిత్యము నిన్ను పూజింతుముగా ఇలలో ఇలవేల్పువుగా
అందుకే రారా అనరా శివ...

నరుని జీవితము ఒక నాటకము ఇక్కడ
అడలేను రా శివ నేను ఈ కపట నాటకము...
నరుని కోరికలు నిత్య నూతనము...

అందుకె అనరా శివ రారా యని ఒక్కసారి...

మహాదేవా శంభో శరణు...

Tuesday, September 15, 2020

శివోహం

ఈ శరీరం తో వచ్చిన బంధాలు,
మనస్సు తో  తెచ్చుకున్న అనుబంధాలు, 
అన్ని తొలిగిన క్షణం ,ఒకే ఒక్క బంధం మిగిలి ఉంటుంది అది  భగవంతుడి తో....
అందుకే మన మనస్సు భక్తీ తో ఉన్నప్పుడు , 
మనకు వీలయినప్పుడు, 
సమయాన్ని  వృధా చెయ్యకుండా ,
సద్వినియోగం చేసుకొని భగవత్ చింతన చేస్తే .. జీవితం సన్మార్గం లో వెళ్తుంది......

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
ఓం నమః శివాయ....

శివోహం

శివా!ఎనుబోతు పయనంబు ఎన్నాళ్ళు
నా కామాశ్వము నీకు కానుకయ్యేను
విశ్వమంత హాయిగా విహరించవయ్యా
మహేశా . . . . . శరణు .

Monday, September 14, 2020

శివోహం

మానవుణ్ణి భగవంతునికి సన్నిహితునిగా చేయకుండా అజ్ఞామనెడి గోడ అడ్డుగా ఉంటుంటే, ఈ గోడను పడగొట్టి ముందుకు వెళ్ళినవారు సహితం అహంకారమనెడి మరొక గోడచే వెనుకకు నెట్టివేయబడుతున్నారు.  'భగవంతుడు నిజంగా ఉన్నాడు'  అని గ్రహించడం ఎంత ముఖ్యమో ఆ భగవంతుడిని మనసులో  నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం. కేవలము పుస్తకములను చదివినంత మాత్రమున భగవంతుని తత్వం అర్థమైపోదు! దానిని అనుభవించాలి! చదివిన దానిని, తెలుసుకున్న దానిని ఆచరిస్తేనే జ్ఞానం అనుభవంగా రూపాంతరం చెందుతుంది. ' నాకు అన్నీ తెలుసును, నేను అన్నీ చదివాను, నా కంటే గొప్పవారు లేరు..' ఇలా అనుకుంటే ఇంతకు మించి అజ్ఞానం మరొకటి ఉండదు.  అజ్ఞానం ఉన్న చోట ఆధ్యాత్మికతకు చోటుండదనేది ఎంత సత్యమో ఆహం ఉన్న చోట ఆత్మారాముడు నిలువలేడనేది కూడా అంతే సత్యం. దీనిని మనం గుర్తుంచుకోవాలి.

శివోహం

సుఖాల్లోనే కాదు.....
కష్టాలలో కూడా....
నేనున్నానంటూ ఆప్యాయంగా...
హత్తుకునే నా కన్నీళ్లు...
కోరికల బరువును తాళలేక.....
ఉప్పేనల ఉబికి వస్తుంది....
కన్నీళ్లు కూడా కమ్మగా ఉంటాయని.....
రుచి చూపిస్తుంది.....

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...