Sunday, September 20, 2020

శివోహం

నా ధైర్యం నువ్వే తండ్రి...
నన్ను మోసే వాడివి నువ్వేనని...
ఇంతటి నమ్మకం ధైర్యం ఏ దేవుడు ఇస్తాడు నువ్వు తప్ప...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! గడగడ ......లాడిపోదా
గండమన్నది..... నన్ను చేర
గండర గండడవు నీవు అండగుండ
మహేశా.....శరణు.

శివోహం

మనస్సు నీ అధీనమైతే జీవితం నీ అధీనం...
ఆలోచనలు నీ అధీనమైతే మనస్సు నీ అధీనం...
నీ శ్వాస నీ అధీనమైతే ఆలోచనలు నీ అధీనం...
శరీరం నీ అధీనమైతే శ్వాస నీ అధీనం...

ఓం నమః శివాయ.

Saturday, September 19, 2020

శివోహం

నీకు కష్టాలు వస్తే కంగారు పడకు.
నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది.
నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గుండె గోడలపై 
రాసుకున్నాను 
నీ రాతలను 
నీ గీతలను 

" ఓం నమః శివాయ " 
మహా మంత్రాన్ని
నన్ను నడిపిస్తున్న
కఠిన శివ శాసనాన్ని 

శివోహం  శివోహం

శివోహం

శివా! గడగడ ......లాడిపోదా
గండమన్నది..... నన్ను చేర
గండర గండడవు నీవు అండగుండ
మహేశా.....శరణు.

Friday, September 18, 2020

శివోహం

నిన్ను దర్శించాలి అనే ఊహయే ఎంతో రమణీయమైనది శివ...

హర హర అంటూ నిన్ను తలిచేదను పొందెదను బ్రహ్మానందమును...

మహాదేవా శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...