Monday, September 21, 2020

శివోహం

దర్శక నిర్మాత...
వ్రాసావు నారాత...
నటనలో నడక రాక...
పడుతున్నా తికమక...
మారుతున్నవి రోజులా...
మాయదారి మనుషులా....
కాలానుగుణంగా కధలు వ్రాయక...
నాకులాంటి వాడి బాధ నీకు వేడుక...
నంది పక్కనే పడుంటాను...
పాత్ర మార్చి కరుణించవా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీనామమే గానముగా...
నీగానమే ప్రాణముగా...
జపించి తపించువాడాను...

అడుగు అడుగున అడ్డంకులు కలిగించి...
అయినదానికి కానిదానికి పరీక్షలు పెట్టకు తండ్రి...

హర హర అంటు పిలుస్తున్న కైలాసము వదలి కరుణించగా రావయ్యా శివ

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!అగ్నిలన్నీ నాలో రగులుతున్నాయి
ఆ అగ్నులన్నీ నాలోన భగ్నమవగ
ఓ జడను జులిపించు నీవు భవుడవు గాన
మహేశా . . . . . శరణు .

Sunday, September 20, 2020

శివోహం

నీవు చేయాల్సింది
ఒక్కటే మిత్రమా

నీవు నమ్మిన దైవాన్ని
నమ్మకం కోల్పోకుండా

ఎట్టి పరిస్థితుల్లోనైనా
నమ్మకం నిలబెట్టుకోవాలి

ఆ తర్వాత ఆ ఆదిదేవుడే
అంతా అజ్మాయిషీ చేస్తాడు

శివోహం  శివోహం

శివోహం

నా ఏకాంతంలో 
ఏ మౌనమో అడుగుతుంది ?

నీ శివుడు  ఎక్కడని ??

నేను నీతో ఉన్నానని చెప్పనా !
నీవు నాతో ఉన్నావని చెప్పనా  !!

శివోహం  శివోహం

శివోహం

శివా! ముక్తి మోక్షముల మాట విడిచి పెట్టు
జన్మ కర్మముల మాట జారబెట్టు
ఆత్మ వీడునపుడు సౌఖ్యము కూర్చిపెట్టు
మహేశా . . . . . శరణు

శివోహం

నా ధైర్యం నువ్వే తండ్రి...
నన్ను మోసే వాడివి నువ్వేనని...
ఇంతటి నమ్మకం ధైర్యం ఏ దేవుడు ఇస్తాడు నువ్వు తప్ప...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...