Monday, September 28, 2020

శివోహం

శివా!గణపతి ధళపతి నీ ఇంటి సుతులే
నాభి బంధము లేకె నడయాడ వచ్చారు
అట్టి సుతుడనే కదా నేను కూడా......
మహేశా . . . . . శరణు .

శివోహం

నే ననేక మారులు పుట్టి చచ్చు వివిధములైన
వేల గర్బాల నాశ్రయించాను...
రకరకాల భోజనం చేశాను...
ఎందరో తల్లుల చనుబాలు త్రాగను...
తల్లి కడుపునందున్నపుడు తలక్రిందులై  
ఎన్నో బాదలనుభవించాను...
ఇప్పుడు నేనా పరమేశ్వరుని ప్రేమించి ఆయనకు ప్రియమగునట్లు చరించిన గాని నేని దుఃఖమునుండి
విముక్తుడ కాజాల నని తెలిసికొనుటకు మార్గము చూపరావా శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కుటికోసం కాయకష్టం చేసి చేసి....

నేను అని మరిచి సమస్తం నీవేనని తలిచి
కనులు మూసి సేద తిరేవేళ కలలో నీవే...

ఎదురుగ వచ్చావని పొంగిపోయి నే కళ్లు తెరచి చూడగా కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి నా మనసు చిన్నబోయింది...

ఏమిటి నీ లీలలు ఏమిటి నీ మాయ తండ్రి...

నా ఆయువు దీపం నాకు నేనుగా అర్పుకోవటానికి.. 
నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపులని నీకు తెలియదా...

మహాదేవా శంభో శరణు....

Sunday, September 27, 2020

శివోహం

నీలలోహితాయవు నీవే 
అమరనాథాయనీవే 
పృద్వీలింగాయవు నీవే 
జలలింగాయవునీవే
అగ్నిలింగాయవు నీవే
వాయువు లింగాయవునీవే
ఆకాశలింగాయవు నీవే 
దిగంబరాయవునీవే 
అష్టమూర్తివి నీవే
ఉగ్రాయవునీవే భక్తవత్సలాయవునీవే
కైలాసవాసివి నీవే...
జటాధరాయ కష్టాల నుండి కృప చూపే దేవదేవుడు నీవే పరమేశ్వరా...

నీవే సత్యం నీవే నిత్యం
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

తండ్రీ శివప్పా

నీ 
అక్కున చేరి 
ఆరాధించాలనీ 
అక్షరాలకు ఎందుకింత ఆరాటం ?

నీ 
పాదాల చెంత 
పావనమవ్వాలనీ 
పదాలకు ఎందుకింత పరవశం ?

నీ 
భక్తునిగా 
బంధీగా మారిపోవాలనీ
భావాలకు ఎందుకింత భావోద్వేగం ?

శివోహం  శివోహం

శివోహం

శంభో!!!విశ్వ ధ్యాసలో నీవు...
నీ ధ్యాసలో నేను...
విశ్వమందు నీవు లేకపోతే శూన్యమే...
నాలో నువ్వు లేకపోతె శవమే...
మహాదేవా శంభో శరణు

Saturday, September 26, 2020

శివోహం

సాటివారి కింత సాయంబు....
చేయుటే ధరణిలోన గొప్ప ధర్మము...
మంచి మనసుతోడ మానవసేవయే...
మాన్యమైన పూజ మాధవునకు...
హారేకృష్ణ హరే రామ
రామ రామ హరే హరే
ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...