Sunday, October 4, 2020

శివోహం

శివా!కాంతివి నీవు.....
శాంతివి నీవు.....
భ్రాంతిని నేను.....
మహేశా.....శరణు..

శివోహం

ఒక్కటే మార్గం...
నిన్ను చూడాలంటే...
నా కనులు మూయాలి...
మహాదేవా శంభో శరణు...

Saturday, October 3, 2020

శివోహం

శివా ! మహాదేవా... 
నాసిక్ పురవాసా... 
త్రయంబకేశ్వరా... 
గంగనెత్తుకొని... 
మా'గెడ్డగొంతు తడిపే... 
జంగమయ్యా... 
నీ పాదారవిందములే... 
నాకు నిత్యమూ...  
శరణం శరణం శరణం... !!! 🙏

శివోహం

శివా ! మహాదేవా... 
బతుకు పోరులో... 
నేను దారి(ధర్మం)తప్పలేదు... 
భక్తి బాటలో... 
నీ దారి(శివసేవ)మరువ లేదు... 
ఓ శంకరా !! 
నీ కింకరున్ని దయచూపు... 
తండ్రీ దుర్గామల్లేశ్వరా... !!! 🙏

శివోహం

శివా ! నిన్ను మెప్పించ... 
మంత్రం, తంత్రం తెలియదు... 
శ్రీకాళహస్తీశ్వరా... 
వాదమేల నా పేదబ్రతుకు... 
తీర్చ బ్రోవ రావా భక్తవత్సలా... !! 
మాతా శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరా... 
పాహిమామ్ పాహిమామ్... !!!  🙏

శివోహం

శివా ! నా ఆలోచనలు... 
సదా నీ పాదపద్మములనే... 
ఆశ్రయింపజేయుము తండ్రీ... 
శ్రీ వైద్యనాథా... !!
నీ పాదారవిందములే... 
నాకు నిత్యమూ... 
శరణం శరణం... !!!  🙏

శివోహం

శివా ! సమస్త జీవకోటిని 
ఆదరించి అనుగ్రహించే మహదేవా... 
పరమదయామయా... భక్తవత్సలా... 
నాలోని లోపాలు తొలగించి... 
పాపాలు నశింపజేసి... 
నీ దివ్యానుగ్రహం అందించు... 
తండ్రీ సోమనాథా... !! 
చంద్రశేఖరా... 
పాహిమామ్ రక్షమామ్...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...