Sunday, October 4, 2020

శివోహం

జానెడు పొట్ట నింపుకునేందుకు చేసే ఆకలి పోరాటంలో నీ ధ్యాస తగ్గుతున్న మాట నిజమే...
ఎం చేయను మోయలేని బంధాలను తగిలించుకున్న...
వదలలేక నీ సాయం కోరుతున్న...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ త్రినేత్రం 
అఖండ జ్యోతి స్వరూపమై 

నా గుండె గుడిలో
వెలుగుతూ ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఒక్కటే మార్గం...
నిన్ను చూడాలంటే...
నా కనులు మూయాలి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!కాంతివి నీవు.....
శాంతివి నీవు.....
భ్రాంతిని నేను.....
మహేశా.....శరణు..

శివోహం

ఒక్కటే మార్గం...
నిన్ను చూడాలంటే...
నా కనులు మూయాలి...
మహాదేవా శంభో శరణు...

Saturday, October 3, 2020

శివోహం

శివా ! మహాదేవా... 
నాసిక్ పురవాసా... 
త్రయంబకేశ్వరా... 
గంగనెత్తుకొని... 
మా'గెడ్డగొంతు తడిపే... 
జంగమయ్యా... 
నీ పాదారవిందములే... 
నాకు నిత్యమూ...  
శరణం శరణం శరణం... !!! 🙏

శివోహం

శివా ! మహాదేవా... 
బతుకు పోరులో... 
నేను దారి(ధర్మం)తప్పలేదు... 
భక్తి బాటలో... 
నీ దారి(శివసేవ)మరువ లేదు... 
ఓ శంకరా !! 
నీ కింకరున్ని దయచూపు... 
తండ్రీ దుర్గామల్లేశ్వరా... !!! 🙏

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.