Monday, October 5, 2020

శివోహం

ఔను
ఇది అద్భుతమే !

ఇద్దరిదీ
ఒకే రూపం కదా !!

హర నమః
పార్వతీ పతయే

హర హర మహాదేవ
శంభో శంకర  శరణు శరణు

శివానీ  శివోహం

శివోహం

శివా!అక్షరాలు లేని భాష అలవరచుకున్నాను
నీ చెట్టు క్రిందకు చేరి చూస్తున్నాను
చెప్పవయ్యా నీ మాట చిత్తమెరుగ
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో!!!ఓం నామాలు రుచి చూపిన నీవు
ఓసారి ఇటు కన్నెత్తి చూడవయ్యా...
ఒకింత నాపై జాలి జూపక రావయ్యా...
ఓటమికి అంచులకు అలవడినాను...
ఒంటరిని చేయక నను ఇకనైనా గురుతెరగవయా...

మహాదేవా శంభో శరణు...

Sunday, October 4, 2020

శివోహం

ఎవరో
ఏదో అనుకుంటారని ?
నీకు నచ్చిన
నీవు మెచ్చిన ??

శివ భావాలను
పంచుకోలేక పోతే ?
నిజంగా
నీవు మూగవాడివే మిత్రమా ??

శివోహం  శివోహం

శివోహం

జానెడు పొట్ట నింపుకునేందుకు చేసే ఆకలి పోరాటంలో నీ ధ్యాస తగ్గుతున్న మాట నిజమే...
ఎం చేయను మోయలేని బంధాలను తగిలించుకున్న...
వదలలేక నీ సాయం కోరుతున్న...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ త్రినేత్రం 
అఖండ జ్యోతి స్వరూపమై 

నా గుండె గుడిలో
వెలుగుతూ ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఒక్కటే మార్గం...
నిన్ను చూడాలంటే...
నా కనులు మూయాలి...
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...