Tuesday, October 6, 2020

శివోహం

శంభో!!! పేదోణ్ణి కానీ...
నిన్ను పూజించడం లో కాదు...

నీ దయ తండ్రీ...

శివోహం

మనసుకి తగిలిన గాయాలకు మందులు లేనేలేవు...

మహాదేవా శంభో నీవే దిక్కుయని మనసారా తలుచుకుంటూ ఓం నమః శివాయ యని నీ నామస్మరణే చేస్తున్న....

మహాదేవా శంభో శరణు...

Monday, October 5, 2020

శివోహం

శంభో ! ఏనాడు నీకు మంచిగంధం తెచ్చి పూసిందిలేదు... బిల్వార్చన చేసిందిలేదు...
సుగంధభరిత పుష్పాల తో అలంకరించిందీలేదు...
ఇవి ఏమీ తెలియని, చేయని నన్ను ఎంతగానో ఆదరించి అనుగ్రహిస్తున్నావే...
శంకరా ఇది పుత్రవాత్సల్యం కదా తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఔను
ఇది అద్భుతమే !

ఇద్దరిదీ
ఒకే రూపం కదా !!

హర నమః
పార్వతీ పతయే

హర హర మహాదేవ
శంభో శంకర  శరణు శరణు

శివానీ  శివోహం

శివోహం

శివా!అక్షరాలు లేని భాష అలవరచుకున్నాను
నీ చెట్టు క్రిందకు చేరి చూస్తున్నాను
చెప్పవయ్యా నీ మాట చిత్తమెరుగ
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో!!!ఓం నామాలు రుచి చూపిన నీవు
ఓసారి ఇటు కన్నెత్తి చూడవయ్యా...
ఒకింత నాపై జాలి జూపక రావయ్యా...
ఓటమికి అంచులకు అలవడినాను...
ఒంటరిని చేయక నను ఇకనైనా గురుతెరగవయా...

మహాదేవా శంభో శరణు...

Sunday, October 4, 2020

శివోహం

ఎవరో
ఏదో అనుకుంటారని ?
నీకు నచ్చిన
నీవు మెచ్చిన ??

శివ భావాలను
పంచుకోలేక పోతే ?
నిజంగా
నీవు మూగవాడివే మిత్రమా ??

శివోహం  శివోహం

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.