Friday, October 9, 2020

శివోహం

రామ అన్నది ఒక్క నామమే కాదు మంత్రం కూడా...

రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది...

తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు...
ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు...

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే

Thursday, October 8, 2020

శివోహం

ఈ తోలు తిత్తిపై
పెద్దగా ఆశ లేదు 

నీ ఇంటి ద్వారానికి
తోరణమైతే చాలు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా!కాలము శూలము  చేతబట్టేవు
పాశాలు పగ్గాలు చేత చుట్టేవు
ఇహ పరముల కూడ మమ్ము తిప్పేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఆ మూడు రేఖలు నా నుదుట నిలిపి...
నడుమ కుంకుమ బొట్టు నీ గుర్తుగా నిలుపవా...
నా ముఖంలో కనిపించే ముడతలు నీ రూపాలే కదా శివ...

మహాదేవా శంభో శరణు...

Wednesday, October 7, 2020

శివోహం

శంభో!!!
నీటి బుడగలాంటి బ్రతుకు... 
నీటి అలలవలే సంపద... 
మెరుపువలే జీవితం... 
ఉరుముతున్న కష్టాలు... 
శరణాగతుడనైతిని శివ.... 
దయచూపు...
కరుణతో రక్షించు...
మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా! నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా ..... శరణు.

శివోహం

శివా! నా గుండె బండరాయి అనుకున్నా
నీ నామం పలుకుతుంటె తెలిసింది
అది బండరాయి కాదు పలుకురాయని .
మహేశా ..... శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...