Monday, October 12, 2020

శివోహం

శంభో!!!
నాలుగు గదులు...
ఒక ఊపిరి దారి...
1. గణపతి, 2. సుబ్రహ్మణ్యం, 3. నంది, 4. అమ్మవారు, 5. ప్రధాన దేవుడవు నీవు...
నా హృదయమే నీకు పంచాక్షరీ మంత్ర స్మరణతో ఓ పంచాయతన క్షేత్రం...
మరి నీపరివారాన్ని పురమాయించి ఈ క్షేత్రానికి రక్షణ ప్రహారికి పహారా ఏర్పాటు చేయి పరమేశ్వరా...
నిను నమ్మి మిమ్మల్ని అయ్యప్ప స్వామితో సహా అందరినీ నా హృదయములో నిలుపుకున్నాను...

తర్వాత నీ దయ

మహాదేవా శంభో శరణు...

ఓం గం గణపతియే నమః

భక్తిమాత్రమే పరమార్ధజ్ఞానమును కలుగజేయును.
భక్తి యొక్కటియే సంసారరోగమును నశింపజేయును.
భక్తి యొక్కటియే పరతత్త్వమును కలుగజేయును.
భక్తి యే ముక్తినిచ్చును.

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, October 11, 2020

శివోహం

శంభో ! నీ ధర్మకాటా లో...
నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా...
నన్ను వదిలేయకు తండ్రీ...

మహాదే6శంభో శరణు...

శివోహం

శివా!అష్టోత్తరమైనా సహస్రమైనా
నేను సమర్పించే కుసుమ మొకటే
ఎద కుసుమం, గ్రహించు అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివోహం

వెండికొండలో ఉండు వేదవిదుడవు నీవు... 

మూడుకన్ను లుండి ముల్లోకములను...
యేలే గరళకంఠడవు నీవు....

నిర్మలా హృదయ దయాంతరంగుడు....
విభూతినమేయుడు నీవే కదా తండ్రి....

మహాదేవా శంభో శరణు....

Saturday, October 10, 2020

అయ్యప్ప

ఉదయ భానుడు వచ్చి చాలా సేపైంది...

ఉదయాన్నే నా ఇంటికి వస్తానని కలలో మాటిచ్చావు...

వేకువ రేఖలు తూర్పు తలుపుల వాకిట సవ్వడి
చేయక ముందునుంచే నీకోసం ఎదురు చూస్తున్నాను...

శబరిగిరి దిగిరా తండ్రి నా కన్నీటి సంద్రం లో జలకమడిపో....

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!పొగడ్త తెగడ్తలు నీకు పట్టవాయె
పంచభూతములు నిన్ను పట్టలేవాయె
నిన్ను పట్టి కట్టగలది ఆ భక్తియొకటే
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...