Wednesday, November 4, 2020

శివోహం

ఆ, ఉ, మా లను కలిపి అమ్మలాంటి "ఓం" గా మలచి
తొలి మాటగా అమ్మా అని కేరింతలు కొట్టించావు...

జీవితపు ఊయలలో, తోడుగా ఊగే ఊపిరి ఊగిసలాట లో నీవే నాలో నేను శివజ్యోతిని వెలిగించగ రావా శివ...

మహాదేవా శంభో శరణు...

Tuesday, November 3, 2020

శివోహం

ఎవరు బాధలు లేనివారు కన్నీటి జగతిలో
బాధ లెవరూ దాటలేరు
బాధలను తొలగించు శక్తి
ఎవరి కున్నది ధరణిలోన
దైవ మందు మనసు పడితే
బాధలన్నీ కరిగిపోవు

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

తనువు నీవని మోసపోవద్దు...
అది ఎంత కులికినా వల్లకాటిలో కాలి బూడిదగును...
గాలి పీల్చిన దేహ ముండును...
గాలి పోయిన కుప్పకూలును...
చితిలో చర్మము చితికి పోవును...
కనుల ముందే మాయ మగును...
అందుకే ఓ మనసా పాపం పొగట్టుకో పరామాత్మను తెలుసుకో....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది
అయ్యప్ప దీక్ష లోనే...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

మనసు ఉంది 
మంత్రం ఉంది 
గుండె ఉంది 
గురుతు ఉంది 

ధ్యానం ఉంది 
ధ్యేయం ఉంది 
బంధం ఉంది 
భస్మం ఉంది 

నను విడిచే దేహం ఉంది
నిను చేరే ప్రాణం ఉంది 
ఇంతకు మించి 
ఇంకేమి కావాలి తండ్రీ నీకు 

శివోహం  శివోహం

Monday, November 2, 2020

శివోహం

కష్ట సుఖాలలో
సుఖసంతోషాలలో
తోడునీడగా నిలిచినవాడే నిజమైన స్నేహితుడు.
ఈ స్నేహం ఈనాటిది కాదు
ఎన్ని తీరాలు దాటినా
ఎన్ని తరాలు గడిచినా
నిరంతరం మనలను కాచి కాపాడుతుంది మనసున్న
మహాదేవుడు పరమేశ్వరుడు....

మహాదేవా శంభో శరణు

శివోహం

శంభో!!!
అలా ఎత్తిన నీ పాదం నా శిరస్సు పై మోపి....

నాతో పాటు పెరిగి పెద్దయి నన్ను నిలకడ లేకుండా చేస్తున్న అరిషడ్వర్గాలకు అణగదొక్కు...

నాలో అణువణువునా ఆవరించి ఉన్న ఆహాన్ని నీకు నివేదనగా అర్పిస్తాను....

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...