Tuesday, November 3, 2020

శివోహం

మనసు ఉంది 
మంత్రం ఉంది 
గుండె ఉంది 
గురుతు ఉంది 

ధ్యానం ఉంది 
ధ్యేయం ఉంది 
బంధం ఉంది 
భస్మం ఉంది 

నను విడిచే దేహం ఉంది
నిను చేరే ప్రాణం ఉంది 
ఇంతకు మించి 
ఇంకేమి కావాలి తండ్రీ నీకు 

శివోహం  శివోహం

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! హలమును దాచి గళమును విప్పి  వచ్చావు రుద్రనాయకుడి వై భధ్రమూర్తిలా నడిపిస్తావు.....