Friday, November 6, 2020

శివోహం

శివా!అర్ధ దేహమునే అమరియున్నావు
వామార్ధము నీ వారికి ఒసగేవు
అర్ధమేమగునో నాకు ఎరుక చేయి.
మహేశా ..... శరణు.

శివోహం

శివా!నమః శివాయ నమః శివాయ అంటున్నా
నకార మకార మమకారం తొలగించమంటున్నా
రాగ , వికారాలు వదిలించమంటున్నా
మహేశా   . . . శరణు .

శివోహం

శివా!అర్ధ దేహమునే అమరియున్నావు
వామార్ధము నీ వారికి ఒసగేవు
అర్ధమేమగునో నాకు ఎరుక చేయి.
మహేశా ..... శరణు.

శివోహం

ఈ సృష్టంతా సర్వేశ్వరుని స్వప్నసదృశ్యం...
సర్వాంతర్యామి స్వప్నమిది....
మనమంతా ఆ జగన్నాటకంలో పాత్రలం...
ఆట ఆడేది ఆడించేది అంత ఆయనే...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఈశ్వరుని లీలావతారము గలవాడవు.  
గొప్ప తేజస్సుగలవాడవు...
మోక్షమను ఫలం నిచ్చుటకు కల్పవృక్షంవంటివాడవు...
నీ నామాన్ని జపించేవారికి...
నిను సదా స్మరించేవారికి...
నీ రూపాన్ని అర్చించేవారికి...
నీవు సర్వకార్యసిద్ధిప్రదుడవు అవుతావు తండ్రి...

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

భవ జలధిని  
దాట లేకున్నాను 

శూలమే తోడుగా 
దరి చేర్చే తెడ్డుగా 

నీ ఒడి లోకి చేర్చుకో తండ్రీ 

శివోహం  శివోహం

Thursday, November 5, 2020

శివోహం

అమ్మ-నాన్నలు...
విశ్వమే వారు...
విశ్వమంతటా ఉభయులు...
అందరికీ అభయములీయగ...
అణువణువున వెలసినారు...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...