Sunday, November 8, 2020

శివోహం

దేవాలయంలో దేవునిమూర్తిని
దర్శించాలంటే బాహ్యశుద్ది చాలు
దేహాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే
అంతరశుద్ధి కావాలి
 
ఓం నమః శివాయ

Saturday, November 7, 2020

శివోహం

మంగళకరుడవు గౌరీపతివి...
నీ సన్నిధి నా పెన్నిధి...
మౌనంగా నా వేదన నీకు నివేదన...
అన్యమాలోచించని మార్గం ఉపదేశింవా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

తల్లి పుట్టిన తర్వాతే తెలిసింది లోకానికి
ప్రేమ పుట్టిందని...

ఒక శ్వాస ఆడటానికి తన శ్వాస నిర్బందించి
కడుపులో పడ్డప్పటి నుంచి కడుపు చీల్చుకు వచ్చే వరకు
బాధలన్ని సంతోషంగా భరించేది తల్లి ప్రేమ...

ప్రేమనంత పాలధారగా మార్చి ముసి ముసి నవ్వుల
ముద్దు మాటల  మురిపాల చేష్టలే లోకంగా బ్రతికి తన మనుగడనే మరచి బిడ్డ ఎదుగుదలను ఆకాంక్షించి
ఏ కష్టానికైనా చలించక శ్రమించి మన బ్రతుకునకు బంగారు బాటలు వేస్తుంది...

అమ్మ నీకు వందనం...❤️

శివోహం

శివా!పశు పక్షాదులు నీ సన్నిధి మెరియ
పశుపతినాథుడవని  తెలిసి పరవసించేను
ఓ పశువుగా నేను నీ పదము చేరనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

ఎన్ని ఆశలు నాలో పుట్టిన...
పుట్టెడు దుఃఖం నన్ను వెంబడించిన...
నీ చిత్తం లో ఉంటాను...
నిత్యం  భజిస్తూ కొలుస్తూ ఉంటాను...
మహాదేవా శంభో శరణు

Friday, November 6, 2020

శివోహం

జయజయ రామ - జానకి రామ
పావన నామ - పట్టాభి రామ
జై శ్రీరాం జైజై హనుమాన్

హరే కృష్ణ

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే....

అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును...

వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...