Wednesday, November 11, 2020

శివోహం

చెడితే కానీ తెలియని.....
చెపితే కానీ అర్ధం కానీ....
ఆచరిస్తే కానీ అర్థం కానివి
శివ తత్వాలు , జీవిత రధచక్రాలు...
నిన్ను నీనామంతోనే విసిగిస్తాను...
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 
అంటూ...
నీరాకకోసం ఎదురుచూస్తున్న...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నడుము వరకు ములిగి పోయేను
నిను చేరు మార్గమ్ము మరచిపోయేను
చేయూత నిచ్చి నీ చెంత చేర్చుకోవా
మహేశా . . . . . శరణు.

Tuesday, November 10, 2020

శివోహం

శంభో
నా అంతరంగపు ఊసులు అన్నీ ...
నీకే చెప్పుకుంటూంటాను ...

నువ్వు వింటున్నావో లేదోమరి ...
చెడుగాలి నా చుట్టూ ఆవరించివుంది ...

ఉబుసుపోక చెప్పుకునే మాటలకు మల్లే ...
నా అంతరంగాన్ని గాలికొదిలేయకు సుమా ....

నీ ముంగిట విచ్చుకున్న పూవు లా ఊపిరి విడవాలనుంది ...

మహాదేవా శంభో శరణు...

Monday, November 9, 2020

శివోహం

హనుమంతుడు ఉన్నచోట 
భయం ఉండదు
ధైర్యం ఉంటుంది. 
నిర్వేదం ఉండదు
ఉత్సాహం ఉంటుంది. 
సంశయం ఉండదు
స్పష్టత ఉంటుంది. 
అలసత్వం ఉండదు
కార్యదీక్ష ఉంటుంది.
తడబడడం ఉండదు, 
దాక్ష్యం (కార్యసాధనలో నేర్పు) ఉంటుంది. అపజయం ఉండదు
విజయం ఉంటుంది.

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

తొలివేలుపు  పూజతో ముదమునంది మీపై వరములుకురిపించుగాక వరదుడై

ఓం గం గణపతియే నమః

Sunday, November 8, 2020

శివోహం

శివా!నిన్నంటు నిందేది నిఖిలమ్ములోన
నిను తాకు బలమేది భువనాలలోన
నను చేరు భయమేది నీ రక్షలోన
మహేశా . . . . . శరణు .

శివోహం

రాశులు 12
గ్రహాలు 9
జనన సమయం లగ్నం
లగ్నాధిపతి, రాశ్యాధిపతి, గ్రహాల చెలిమి, వైరములు
ఇవేమి తెలియవు నాకు..
నాకు తెలిసింది నీమాట, నీపాట.
ఎలా ఆడిస్తే అలాగే ఆడతాను
గెలిచిన, ఓడినా నీదే భారం
నీట ముంచుతావో,పాలముంచుతావో, 
గంగలో ముంచి మోక్షమే ఇస్తావో నీపై భారం వేసా..
భరోసా ఈయవయా మహేశా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...