Sunday, November 15, 2020

జన్మదిన శుభాకాంక్షలు VN రుద్రన్ష్ నాయక్

ఆయుష్మాన్ భవ...
శతాయిష్మాన్ భవ...

నీ ఉత్సాహం తేజోమయమై
నీ ఉల్లాసం కాంతిపుంజమై
నీ యవ్వనం  ఒక సంకల్పమై
నీ ప్రతి కార్యం ఒక విజయపతంగమై
నీ విజ్ఞానసంపద ఒక నూతన తేజమై
నీ ఆనందం ఒక ఆహ్లాదపు కెరటమై
మాకు నీవు ప్రియ పుత్రుడవై
నీ  గురువులకు నీవు ప్రియ శిష్యుడవై
నీ స్నేహితులకు నీవు దిక్సూచివై
భవిష్యత్తులో ఒక  రాకుమారుడులా
నీ భవితను సువిశాలంగా విస్తరింపచేస్తూ
విక్రమార్కుడువై , శ్రీనికేష్ రుద్రన్ష్ వై
నువ్వెంత ఎదిగినా   మా అందరి హృదయాలలో
చిన్ని మణికంఠ వై ,చిరకాలం చిరంజీవిగా వర్దిల్లమని
నీ జన్మ దిన శుభ సందర్బంగా శుభాశీస్సులు తెలుపు
మా హృదయ మందార దీవెనలతో...

జన్మదిన శుభాకాంక్షలు VN రుద్రన్ష్ నాయక్...

ఇట్లు,
మీ అమ్మ నాన్న❤️

దీపావళి శుభాకాంక్షలు

దీపం జ్యోతి పరం బ్రహ్మ
దీపం జ్యోతి మహేశ్వర
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదేవి నమోస్తుతే

శివోహం

శివం... సుందరం 
అంతర్యామి అయిన పరమేశ్వరుడు ఒక్క భూలోక వాసులకే కాదు, త్రిలోక నివాసులకూ ఆరాధ్యుడు. ఆయన ధరించిన విభూతి కోసమే ఇంద్రాది దేవతలు ప్రార్థిస్తారు. రావణాది దానవుల శివభక్తి లోక విదితమే. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం కైలాసగిరినే తన భుజస్కంధాలపై ఎత్తుకొన్నవాడు దశకంధరుడు. స్వామి ఎంతకూ ప్రత్యక్షం కావడం లేదని, తన ఉదరం నుంచి పేగుల్ని వెలికి తీసి వీణలా మోగించిన భక్తి ఆ దశాననుడిది! దేవతాకోటిలోని వారు గంధర్వులు. గానప్రియులైన వీరు అపూర్వ శివభక్తి పరాయణులు. అలాంటి గంధర్వుల్లో ఒకరైన పుష్పదంతుడికి సంబంధించిన శివభక్తిని ఒక కథ విపులీకరిస్తుంది. శివుడి మహిమను అది స్పష్టంగా బోధించడంతో పాటు, భక్తిలో గల విశిష్టతనూ తెలియజేస్తుంది.

పూర్వం శివభక్తుడైన ఒక రాజు ఉండేవాడు. అతడు ప్రతి నిత్యం పుష్పవనంలో పూచిన పూలతో శివుణ్ని అర్చించేవాడు. ఒకనాడు ఉదయమే పూలు తెమ్మని భటుల్ని అక్కడికి పంపాడు. అక్కడ వారికి ఒక్క పూవైనా కానరాలేదు. పూలు ఏమయ్యాయని ఉద్యానవన పాలకుణ్ని అడిగారు. గత రాత్రి ఎవరో వనంలోకి దూరి పూలు తీసుకెళ్లి ఉంటారని బదులివ్వడంతో, భటులు అదే విషయాన్ని రాజుకు నివేదించారు. రాత్రివేళల్లోనూ కాపలా కాయాలంటూ ఆయన అనేకమంది రక్షక భటుల్ని నియమించినా, పూలు మాయమవుతున్నాయి. భటులు రాజుకు విన్నవించారు. శివభక్తుడైన ఆయనకు విషయం అప్పుడు అర్థమైంది. ఎవరో శివభక్తుడు ‘తిరస్కరిణి’ (ఎవరికీ కనిపించకుండా ఉండే శక్తి)తో ఆ పనిచేస్తున్నాడని గ్రహించాడు.

రాజు వెంటనే ఆ పూలతోటలోని దారి అంతటా శివ నిర్మాల్యం (శివుడికి పూజలో సమర్పించిన పవిత్ర పుష్పాలు) చల్లించాడు. అలా చేయడం వల్ల అజ్ఞాత భక్తుడు ఆ పూలను తొక్కి తన మహిమ కోల్పోతాడని, అప్పుడు అతణ్ని సులభంగా పట్టుకోవచ్చని భావించాడు. ఆయనఆదేశించినట్లే భటులు చేశారు. ఎప్పటిలాగే రాత్రివేళ పూలతోటలోకి ప్రవేశించిన గంధర్వుడు ఆ శివ నిర్మాల్యాన్ని తొక్కడంతో, అతడి దివ్య మహిమలన్నీ నశించాయని పురాణ గాథ. అతడి తిరస్కరిణి శక్తి, ఆకాశ గమన శక్తి మాయమయ్యాయి. తెల్లవారితే రక్షకభటులు పట్టి బంధిస్తారని భయపడిన గంధర్వుడు- దయామయుడు, సంకట నాశకుడు అయిన శివుణ్ని రాత్రంతా స్తుతిం చాడు. శివుడు అతణ్ని అనుగ్రహించి, దివ్య శక్తుల్ని తిరిగి ప్రసాదించాడు. అప్పుడు ఆ గంధర్వుడు తన లోకానికి తిరిగి వెళ్లిపోయాడు. ‘పుష్పదంత’ నామధేయుడైన ఆ గంధర్వుడు చేసిన ‘శివ మహిమ్న స్తోత్రం’ జగత్తులో ప్రసిద్ధమైంది.

శివ యథార్థరూపం ఎంతో గొప్పది. స్వర్గమార్గం నుంచి ప్రవహిస్తూ వస్తున్న ఆకాశగంగ ప్రవాహంలో, నక్షత్రాలు చిన్నపాటి బిందువుల్లా మారుతున్నాయి. సముద్రాలతో చుట్టిన భూమి ఒక చిన్న దీవిలా కనిపిస్తోంది. నదులు, సముద్రాలు, భూమి- అన్నీ శివుడి శిరస్సుపై బిందువులా చేరాయి. ఇదీ స్వామి దివ్య స్వరూపం! ఈ రూపాన్ని ఎవరైనా వూహించగలరా... అంటూ సుందర వర్ణనలతో శివపారమ్యాన్ని విశదం చేస్తుందీ స్తోత్రం! అందుకే ఇది శివభక్తుల పాలిట అమృత సింధువు. ఆయన మహిమ అనంతమని వారందరి ప్రగాఢ విశ్వాసం!.

శివోహం

ఎగసి పడే భాధనంత...
కంటనీరుగా కారకుండా.  
గుపెడంత గుండెలోన....
భద్రపరిచి దాచి ఉంచ...
దాగలేనని అది అలల కడలిల...
ఉరకలేస్తూ పరుగుతీస్తూ...
మది భంధనాలను తెంచుకుంటు...
వాన చినుకుల కన్నుల నుండి కారుతుంది...
నిన్ను అభిషేకించడానికి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!అభిషేకాన నీవు చెప్పకనే చెబుతున్నా
నీకేవి అంటవని,మమ్మ అంటించుకోవద్దని
నీ మాటే వింటున్నా చేయలేకపోతున్నా 
మహేశా. . . . . శరణు .

శివోహం

శివా! చిరాకు పడుతున్న నా మనసుకు
పరాకు చెబుతోంది  నీ నామం
చిరాకు తొలగించు పరాకు నెరిగించు
మహేశా ..... శరణు.

శివోహం

శివా!ఒకసారి చూడు నావైపు
ఆ కాంతి మార్గాన పయనించి
నిటలాక్ష నిన్ను చేరుకుంటాను 
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...