Tuesday, November 17, 2020

శివోహం

మణికంఠ! నాకు మంత్రము తెలియదు...
తంత్రము తెలియదు... !! 
తెలిసిందల్లా నువ్వున్నావని నమ్మడం నిను అనుసరించడం...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు..
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!కర్మాచరణల నేను కూడివున్నా
కర్మ ఫలముల వెంట నన్ను తిప్పకోయి
అవి జనన మరణములందు తిప్పునోయి
మహేశా . . . . . . శరణు .

జైశ్రీరామ్

హనుమ!!!
నీ మనసు మానవ సరోవరం....
నీ తేజస్సు హిమాలయం....
నీ రూపం రుద్రరూపం...
నీ శౌర్యం ప్రభాదివ్యకావ్యం....
నీ నామస్మరణ సర్వ దుఃఖ పరిహారం... 

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

Monday, November 16, 2020

శివోహం

శివా!ఈ రథమును కూర్చిన నీవే
సారథినెరిగించు వారధి చూపించు
నిను చేరుట గమనించు 
మహేశా . . . . . శరణు

శివోహం

ఖర్మ ప్రాబర్ధమనే చీకటిలో భగవంతునికై
శ్రద్ధగా నమ్మకమే దీపాన్ని వెలిగించు...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, November 15, 2020

శివోహం

నిన్ను చూడని నిమిషాన....
నీ నామ స్మరణా చేయని నిమిషాన....
అన్ని బంధాలు వదిలించుకున్న నిమిషన.....
ఆ నలుగురు నన్ను రోధనతో బయటికి పంపినప్పుడు....
ఏ దిక్కు లేని నాకు నిదిక్కే కదా సదాశివ......
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీవి విభూతులు నావి అనుభూతులు
అనుభూతికే కాని అక్షులకు కానరావు
కలవు నీవని ఒప్పుకుంటాం కానరావని చెప్పుకుంటాం.....
మహేశా .....  శరణు..

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...