Friday, November 20, 2020

శివోహం

శివా!నీటి బుడగను మనిషిగ జేసి
ఆ మనిషి జీవితం నీటి బుడగగ జేసి
మాయ చేసావు లీల చూపేవు 
మహేశా......శరణు.

Wednesday, November 18, 2020

శివోహం

శివా!ఎగరేసి ఏ తలైనా ఎగిరిపోవు
ఎగిరిన తల నాటితొ కనుమరుగైపోవు
ఆ పైన అహమంత తొలగిపోవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో ! బైరాగినంటావు
ముళ్లోకాలు ఏలుతుంటావు...
ఆది బిక్షువునంటావు
ఆదిశక్తి అంబతో ఉంటావు...
నీ లీలలు వర్ణింప నా తరమా తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

బరువైన బాధలను కన్నీటితో...
మోసేస్తూ ఉండాలి మరి...
ఎందుకంటే జీవిత ఒక నాటకం...
ఆటాడించే వాడు ఒకడుంటాడు...

శివా నీ దయా తండ్రి....

Tuesday, November 17, 2020

శివోహం

శంభో ! నా పిలుపు తలపు... 
నీతో అనుసంధానము గావించుము తండ్రీ... 
నీవు తప్ప నాకు దిక్కేవ్వరు...
మహాదేవా శంభో శరణు... 

శివోహం

మణికంఠ! నాకు మంత్రము తెలియదు...
తంత్రము తెలియదు... !! 
తెలిసిందల్లా నువ్వున్నావని నమ్మడం నిను అనుసరించడం...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు..
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!కర్మాచరణల నేను కూడివున్నా
కర్మ ఫలముల వెంట నన్ను తిప్పకోయి
అవి జనన మరణములందు తిప్పునోయి
మహేశా . . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...