Saturday, November 21, 2020

శివోహం

జీవితం అనే స్మశానంలో...
కాలం అనే  కాష్టం లో...
జన్మ కాలి బూడిద అవుతోంది...
మహాదేవా శంభో శరణు....

Friday, November 20, 2020

శివోహం

నీవే దిక్కని నమ్మిన నీ భక్తులను ఆదుకోవడంలో ఆలస్యం చేస్తావేమో...

కాని అన్యాయం మాత్రం చేయవు తండ్రి...

కడవరకూ నువ్వంటే అదే నమ్మకం... 

దయతో అనుగ్రహించుము... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీటి బుడగను మనిషిగ జేసి
ఆ మనిషి జీవితం నీటి బుడగగ జేసి
మాయ చేసావు లీల చూపేవు 
మహేశా......శరణు.

Wednesday, November 18, 2020

శివోహం

శివా!ఎగరేసి ఏ తలైనా ఎగిరిపోవు
ఎగిరిన తల నాటితొ కనుమరుగైపోవు
ఆ పైన అహమంత తొలగిపోవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో ! బైరాగినంటావు
ముళ్లోకాలు ఏలుతుంటావు...
ఆది బిక్షువునంటావు
ఆదిశక్తి అంబతో ఉంటావు...
నీ లీలలు వర్ణింప నా తరమా తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

బరువైన బాధలను కన్నీటితో...
మోసేస్తూ ఉండాలి మరి...
ఎందుకంటే జీవిత ఒక నాటకం...
ఆటాడించే వాడు ఒకడుంటాడు...

శివా నీ దయా తండ్రి....

Tuesday, November 17, 2020

శివోహం

శంభో ! నా పిలుపు తలపు... 
నీతో అనుసంధానము గావించుము తండ్రీ... 
నీవు తప్ప నాకు దిక్కేవ్వరు...
మహాదేవా శంభో శరణు... 

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...