Sunday, November 22, 2020

శివోహం

శివా!మాలో మూడింటిని  ఒకటి చేయి , 
రెండింటిని తీసివేయి, 
ఆ పైన ఆరింటి పై జయము నీయి.
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో...
చిరాకుతో నేను మాట తులినా...
పరాకుతో నా నడక తడబడినా... 
నన్ను మన్నించి తోడుగా ఉండు...
తనయుడు తప్పు చేస్తే దండించి సరిదిద్దేది తండ్రినే కదా...
నాకు మార్గదర్శకం చేయి తండ్రీ...
మహాదేవా శంభో శరణు...

శివోహం

గుప్పెడు కూడా లేని నా గుండె...
నీకు ఓ ఆలయం అయింది...
నీ మైమరపులో నా మనసు మునిగి...
తన్మయత్వంతో తేలియాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

Saturday, November 21, 2020

శివోహం

మానవజన్మములో గడిపి నరులకు....
మోక్షమార్గమును చూపించిన....
హరిహర తనయుడి ఆయ్యప్ప....
నీ నామమే కలియుగంలో తరకమంత్రాం...
ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

జీవితం అనే స్మశానంలో...
కాలం అనే  కాష్టం లో...
జన్మ కాలి బూడిద అవుతోంది...
మహాదేవా శంభో శరణు....

Friday, November 20, 2020

శివోహం

నీవే దిక్కని నమ్మిన నీ భక్తులను ఆదుకోవడంలో ఆలస్యం చేస్తావేమో...

కాని అన్యాయం మాత్రం చేయవు తండ్రి...

కడవరకూ నువ్వంటే అదే నమ్మకం... 

దయతో అనుగ్రహించుము... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీటి బుడగను మనిషిగ జేసి
ఆ మనిషి జీవితం నీటి బుడగగ జేసి
మాయ చేసావు లీల చూపేవు 
మహేశా......శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...