Friday, December 11, 2020

శివోహం

శివా!పశు జన్మలు నావి పదివేలుగడచినా
నంది కాగల భాగ్యమ్ము నొందగలను
ఎరుక చేయుము ఎదను కోర్కెతీర
మహేశా ..... శరణు.
.

శివోహం

ఏమైనా  వారం రోజులు
పరమాత్ముని తోగాని
పరాయివారితో గాని
సోపతి  చేస్తేనే  తెలుస్తుంది ఆంతర్యం ,అంతరంగం ,అనుబంధం....

ఓం శివోహం... సర్వం శివమయం

శ్రీరామా

స్నేహితులు ఎంత రుచి, ఎంత హాయి భగవన్నామం. జపించండి అందరూ రామనామం, కృష్ణనామం, శివనామం. నామ నావలోనే అందరం పరమాత్ముని సన్నిధికి చేరాలి. ఇంక ఏదీ శాశ్వతం కాదు.

కామక్రోదాలవంటివి దూరం కావాలంటే భగవన్నామాన్ని ఎప్పటికీ విడవకు. భగవన్నామాన్ని వింటూ, సంకీర్తన చేస్తూ ఉంటే మన మనస్సు ప్రసన్నం అవుతుంది, శాంతిస్తుంది.

ఏవం ప్రసన్న మనసః భగవద్భక్తి యోగతః |
భగవత్ తత్త్వ విజ్ఞానమ్ ముక్త సంగస్య జాయతే ||

మొదట నీకు పరిపూర్ణమైన యోగ్యత లేక పోయినా చుట్టూ నలుగురు పాడుతుంటే మెల్ల మెల్లగా నోరు కదిపే అవకాశం ఏర్పడుతుంది. మొదట ఇష్టం లేక ప్రారంభం చేసినది కొంతకాలం సాగగా వీడిలో ఇష్టంతో ప్రవర్తించేట్టు చేస్తుంది. అది ఎంతవరకు వెళ్తుందంటే మొదట భగవంతుని నామాలు విన్న నీకు ఆ భగవంతుని గురించి కలిగే వాస్తవిక జ్ఞానం వరకు తీసుకెళ్తుంది. మొదట నీలో ప్రేమ తాత్కాలికమైనదిగా ఉన్నా అది ఇప్పుడు శాశ్వతంగా నిలిచేంతవరకు తీసుకెళ్తుంది. "భగవత్ తత్త్వ విజ్ఞానమ్" భగవంతుని గురించి కలగాల్సిన యాదాత్మ జ్ఞానం కలిగేట్టుచేస్తుంది. అయితే దానికి ముందర ఎన్నింటిమీదో మమకారాలు పెంచుకున్నావు. అసలు దేవుడెందుకు ఇవన్నీ చాలును అనుకుంటూ. ఇప్పుడు వాటి యందు ఉన్న మానసిక పట్టు అయితే ఏదో ఉందో అది క్రమ క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. "ముక్త సంగస్య జాయతే", ముక్త సంఘుడవు కాలుగుతావు. "భగవద్భక్తి యోగతః", ఆ భగవంతుడి మీద కలిగిన తాత్కాలిక జ్ఞానమే శాశ్వతంగా నిలుస్తుంది.

అప్పుడు ఏమవుతుంది ? నీలో ఉన్న ప్రాచీన కర్మలు ప్రక్కకు జరిగి ఉంటాయి. దీపం ఉన్నప్పుడు చీకటి అనేది అణిగి ఉంటుంది. అట్లానే భగవన్నామ సంకీర్తన వల్ల దూరం జరిగి ఉన్నాయి, కానీ ఈనాడు నీలో ప్రేమ బాగా పెరిగింది. నిష్ట బాగా కుదురుతుంది. సహజమైన ప్రేమ ఏర్పడటానికి మార్గం తెరుచుకుంటుంది.

Thursday, December 10, 2020

శివోహం

శంభో...
నీ నామస్మరణలో ఇహపరాలు రెండూ గుర్తుండవు..
శరీరము తోపదు...
మనసు నీరూపంతో ఐక్యమైపోతూ 
ఆనందాన్ని అనుభవిస్తూ 
నీతో చిందులు వేస్తూవుంటుంది. ...
చెప్పుటకు సాధ్యముగాని ఆనందము...

మహాదేవా శంభో శరణు...

शिवोहम

मेरे नसीब मेरे महादेव ने लिखा है 
वो कबि गलत है ही नही सकता

Wednesday, December 9, 2020

శివోహం

కృష్ణా నీ మోహన మనోహర రూపం చంద్రకాంతికే కొత్త అందాలని ఇచ్చింది....
 
నీ నీలిమేగ కాంతిని గని ఆ చంద్రుడు ఈ జగత్తు లో ఇంతకన్నా సౌందర్యం మొరొకటి లేదుకదా అని మురిసి పోతూ ఉన్నవేళ నీ దర్శన బాగ్యాన్ని నాకు కలిపించావు కృష్ణ ఇదియే పరమానందం కదా...

కనీసం వెదురును అయినా కాకపోతిని క్రిష్ణ...
నీ చేతిలో వేణువై శాశ్వతంగా నిలిచిపోవాడానికి...

రాధే క్రిష్ణ

శివోహం

రామా నామమును మించిన అమృతం మరొకటి లేదు...

జై శ్రీరామ్

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...