Thursday, December 17, 2020

శివోహం

నేనవరో నాకే తెలియదు...
కానీ నేను శంకరా కింకారుడని లోకం మొత్తానికి తెలుసు...

శివ నీ దయ తండ్రి...

శివోహం

నీవు అనంతుడవు...
అఖండ తేజో నిధివి...
నిన్ను తెలియలేను...
నన్ను తెలుసు కొలేను...
సూత్రధారిగా ఉంటూ...
నీవాడించే జగన్నాటకం లో...
ఒక పాత్రధారి నీ మాత్రమే నేను...
వట్టి తోలుబొమ్మను...
నీవు లేకుండా నేను లేను...
నిన్ను స్మరిస్తూ ధ్యానించడం తప్ప...
మరే విధంగా నిను సేవించలేను...
మహాదేవా శంభో శరణు...

Wednesday, December 16, 2020

సైకో

నా జీవితం నీ భిక్ష...
నాకోసం బిచ్చమెత్తి నా కడుపు నింపుతూ ఉన్నావు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కొంచెం సుఖం కొంచెం కష్టం...
సుఖం నీ దాతృత్వాన్ని గుర్తు చేస్తుంది...
కష్టం నన్ను ఈ లోకం నుండి వీడి 
నీ లోకానికి  వెళ్లమంది....

కష్ట సుఖాలు రెండు ఇలా ఎల్లప్పుడూ నీ ధ్యానంలో నన్ను ఉంచుతూనే ఉన్నవి స్వామి 

కష్టసుఖాలకు ఎప్పుడు నమస్కారం...

మహాదేవా శంభో శరణు...

Tuesday, December 15, 2020

స్వామి శరణం

నీ నామము వింటే చాలు నా మది పులకించి పోతుంది...
నీ గానము వింటే చాలు నా మది తపియించును...
నీ నామ స్మరణం వల్ల సలక శుభము కలిగి కొండంత ధైర్యము వస్తుంది...

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప నీ పాదసేవే సకలలోకంబులకు 
మేలు కల్గించును...

శబరిగిరి నివాస పంబ బాల నీకృపే మమ్ములను ఎల్లవేళలా కాచి కాపాడును...

శంకరా తనయ మణికంఠ దేవా శరణు...

Monday, December 14, 2020

శివోహం

అర్హుడినో కాదో పలుమార్లు నిను భజియించుటకు...

వెన్నెలకంటే చల్లనైన నీ ప్రేమ పొందడానికి...

ఏవిదముగా అర్హుడను...?

అయినా నీ పాదలను విడువను శంభో అర్హుడనైతే గుండెలకు హత్తుకో...

అర్హత లేకుంటే విసిరి పారేయ్ అలాగయినా నీచేతి స్పర్శ కలుగుతుంది...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...