Monday, December 21, 2020

శివోహం

కర్మ క్రియ అన్నీ నీవే తండ్రీ...
నీ పాదపద్మములనే బంగారు పంజరంలో నా మనసును బందించు...

మహాదేవా శంభో శరణు...

Sunday, December 20, 2020

శివోహం

రేపు జరిగే దాని గురించి చింత వదిలేయండి...

ఈరోజే ఇప్పుడే *ఓం నమః శివాయ* అనేయండి...
అంత ఆయనే చూసుకుంటాడు...

శివోహం

రేపు జరిగే దాని గురించి చింత వదిలేయండి...

ఈరోజే ఇప్పుడే *ఓం నమః శివాయ* అనేయండి...
అంత ఆయనే చూసుకుంటాడు...

Saturday, December 19, 2020

శివోహం

నిన్నే మా దేవుడని అనుకున్నాము 
మంచు మనసునీదని మా విన్నపాలు విన్నవించుకుంటున్నాము 

నీవొక నమ్మకమే కావచ్చు
నీకొక రూపం లేకపోవచ్చు
కాని శంకరుడంటే మంచివాడంటారు
కరిగిపోయే మనసు కలవాడంటారు
కోపమేమాత్రం వలదయ్య మాపై చూపు నీ దయ

నమ్మకం లేక కాదు కాని నరుడనయ్యాను
సందేహం కాదు కాని సామాన్యుడనయ్యాను
మన్నించి మా విన్నపాలు పంచుకో
మా మనసును ఓ జ్యోతివై మా హృదయాన్నే నీ ఆలయముగా చేసుకో

మహాదేవా శంభో శరణు...

శివోహం

నటించలేను...
క్షణం క్షణం ఊసరవెల్లి లా రంగులు మారే నా మాయదారి మనస్సు చెప్పినట్టు నే నటించలేను...
మనస్సులేని మాయనగరంలో నేనుండలేను...
మహాదేవా శంభో శరణు...

స్వామి శరణం

శబరిగిరి నివాసుడు...
పంచగిరి విహారుడు...
పదునెట్టాంబడి విభుడు...
శుభము లిచ్చి కాపాడే జ్యోతిస్వరూపుడు...

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

Friday, December 18, 2020

శివోహం

శివుడి వెలుగు రేఖలు భూమి మీద రానంత వరకు ఈ జగతికి చికటే...

ఓం నమః శివాయ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...