Friday, December 25, 2020

శివోహం

శంభో!!!నీవు మహోన్నతుడవు
నీకు ఎన్నెన్ని కోట్ల మంది భక్తుల ఎన్నెన్నో కార్యాలు
అయినప్పటికీ నన్నో వంక ఆలకిస్తూనే ఉంటావు
నిజంగా నువ్వు పరమ పావన మూర్తివి తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నా మనస్సు కోవెలలో వెలిసిన కృష్ణ గోపాల నీ దివ్యస్వరుపమునే నా మనస్సు కోవెలలో ప్రతిష్టించితిని మహానుబావ కోకిల స్వరంతో నిన్ను అర్చించితిని ముకుందా నీ పాదసేవ చేయుబాగ్యాన్ని జన్మ జన్మల ప్రసాదించమని కోరితిని శ్రీపాద నీ పెదవులపై వేణువువలె నా ప్రాణానికి ఆధారం నీవే కన్నయ్య నా మానస లోకము లో నిత్యం నీ శ్లోకములు ఆలపించేల నన్ను అనుగ్రహించు గోవిందా

Tuesday, December 22, 2020

శివోహం

మనస్సు పవిత్రంగా ఉంటే...
మాట పవిత్రంగా ఉంటుంది...
ఓంనమఃశివయా

శివోహం

అందరిలోనూ నీవే వున్నావు కదా
నాలోనూ ఉంటావని
నాలో నీకొరకు వెదుకుతున్నా
నేచూసే రూపాలలో నీకోసం చూస్తున్నా
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీకోసం జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు 
నన్ను ప్రశ్నిస్తున్నాయి...
ఎప్పుడు నిన్ను నేను కలుస్తానని...
ఎప్పుడు ఈ కన్నీళ్లతో అభిషేకించాలని....
మహాదేవా శంభో శరణు....

శివోహం

శివుడికి అన్ని తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో...
కాస్త ఓపిక పట్టండి శరణు వెడుతూ ఉండండి...

ఓం నమః శివాయ

Monday, December 21, 2020

శివోహం

ఏది నీ దయ మారుతి నీ పాద సన్నిధి కోరితి...
వాదభేదము వీడితి నీవెగతియని వేడితి...
సంకీర్తన ‌సుధను గ్రోలిన చిరంజీవివి నీ వెగా...
సంకటములను పారదోలిన సదయహదయుడ నీవెగా... లంకను దహించిన ఆలంకచరితుడ నీవెగా...
మధురమైన నీ నామము మంచిదని మదినెంచితి....
నిదురనైన నిన్ను మరువక నిలిచియుంటిని...
సాదుకోటిలో చేర్చుకో నీసేవలే చేయించుకో....

జై శ్రీరామ్ జైజై హనుమాన్
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...