Monday, December 28, 2020

శివోహం

జగతికే మూలమైనవాడు...
దేవగణానికి నాయుకుడు మహాదేవుడు...

ఓం నమః శివాయ

Sunday, December 27, 2020

శివోహం

ఎన్ని కష్టాలు కలిగిన
ఎంత దుఃఖము అనుభవించిన
ఎన్నెన్ని ఓటములు ఎదురైన
పట్టిన నీ పాదం విడువను కాకా విడువను...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నా నింగిలో నీడ నువ్వే...
నను నిలిపి ఉంచే నేల నువ్వే...
నను తడిపే వాన నువ్వే...
ముంచెత్తే వరద నువ్వే...
చీకటి నువ్వే.. 
వేకువ నువ్వే.. 
సంద్రం నువ్వే.. 
తీరం నువ్వే.. 
ప్రకృతి నువ్వే.. 
ప్రళయం నువ్వే...
ఆశ నువ్వే...
తుది శ్వాస నువ్వే హరా...
బతుకాట ఇక చాలు రా...
నీ పిలుపు కోసం కడపటి వాకిట కాచుక్కూచున్నా...
నీ నుంచే విడివడిన నే నీలోకే ప్రవహించేస్తున్నా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఏమని తలిచినా....
ఎంతని తపించినా....
తీరని తపనం నీ భావం....
మహాదేవా శంభో శరణు....

శివోహం

చుట్టూ ఎన్నో సమస్యలు...
అన్నింటికీ ఒకటే మంత్రం...

ఓం నమః శివాయ

Saturday, December 26, 2020

శివోహం

అజ్ఞానాంధకారంలో మునిగే జనులకు సంసార సాగరాన్ని దాటించే దుర్గారూపిణి...
జగజ్జనని
జగదంబిక
అమ్మ దయా ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం నమో మహాదేవ్యై నమః
ఓం దుర్గాదేవినే నమః

శివోహం

నీ నీడన ఏ మాయ ఉండదు తండ్రి..
ఏమాయయైనా మాయం కావలసినదే...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...