Thursday, December 31, 2020

శివోహం

మంచి ప్రవర్తన నిన్ను అందరి హృదయాలలో నిలిచి పోయేలా చేస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, December 30, 2020

శివోహం

ఆకాశం అంటే అల్లంత దూరంలో ఉంది అనుకునేవాడిని...
ఆ ఆకాశంలో నీవు ఉంటావని...
నిన్ను చేరాలంటే అంత దూరం ప్రయాణం చేయాలా అనే ఆలోచన ఇప్పుడిప్పుడే తెలుస్తుంది...
నీవు ఉంటే భూమి...
నీవు దూరమైతే ఆకాశం...
నేనిక్కడ నీవక్కడ...
కలిసేరోజు ఏనాడో కదా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!ఈర్ష్యా ద్వేషాలు నాలో ఎదగనీకు
కామ క్రోధాలు నాలో రగలనీకు
మధ మాత్సర్యాలు నాకు సోకనీకు
మహేశా .... శరణు.

శివోహం

Only Mahadev knows pain in my heart❤️

ఓం నమః శివాయ

శివోహం

పిలవగానే పలికే దేవుడవు...
రాగానే వరాలనిచ్చే హితుడవు...
ఆపదలలో కాపాడే స్నేహితుడవు...
పేదవాడికి సైతం అందుబాటులో ఉండే భోళాశంకరుడవు...
సంపదలెన్ని ఉన్నా, మౌనవిరాగివై లోక కళ్యాణం
కోసం తపమాచరించే మహానుభావుడవు...
ఏతీరున నీతత్వము అర్ధం చేసుకోగలం...
నీరూపు మాటెలా ఉన్నా...
నీ పంచన నిలిచేలా చూడు తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Tuesday, December 29, 2020

శివోహం

గణములకు పతియైన వాడా గణనాధ...

నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను...

అది నువ్వు స్వీకరించి  సిద్ధిబుద్ధిని ప్రసాదించు తండ్రి...

ఓం గం గణపతియే నమః

స్వామి శరణం

అయ్యప్పస్వామి దీక్ష నిజంగా అద్భుతం ,ఆ ఆనందం అనుభవైకావేద్యము. లక్షలాది అయ్యప్పస్వామి భక్తులు ఏటా స్వామి దీక్షలో తరిస్తూ. సనాతన హిందూ ధర్మ సంప్రదాయం నిలబెడుతున్నారు.

ఎన్నో శారీరిక మానసిక ఒత్తిడులకు, కష్టాలకు ,ధన వ్యయ ప్రయాసలకు ఓర్చి , శబరిమల దర్శనా భాగ్యం పొందడంలో కృతకృతులు అవుతున్నారంటే  అందుకు అయ్యప్పస్వామి  కరుణ ఎంతగా ఉంటుందో ఉహించుకోవచ్చును మండల రోజులు ,ఇహాసౌఖ్యాలను ప్రక్కన బెట్టి కేవలం పరం గురించి అంటే అయ్యప్పస్వామి సేవ పూజ స్మరణ చింతనతో ,తరించడం జన్మ ధన్యం చేసుకోవడమే కదా ! .

తాము ఇన్నాళ్లూ సంసారంలో ఉంటూ ఇప్పుడు దీక్షా కాలంలో ,దేనికి అంటకుండా తామరాకు పైన నీటి బిందువులా ఉండడం సామాన్య విషయం కాదు కదా ! "మనసుతో " హృదయంలో అయ్యప్పస్వామి ని ప్రతిష్టించుకొంటు." వాచా" అంటే "స్వామి శరణం అయ్యప్ప శరణం!" అంటూ శరణుఘోషతో జీవిస్తూ "కర్మణా "అంటే వేషధారణ లో నల్లబట్టలు వేస్తూ,మెడలో మాలధారణ తో ,నుదుట విభూతి ధారణ తో ,త్రికరణ శుద్దిగా ,మనసా వాచా కర్మణా , అయ్యప్పస్వామి ని  సేవిస్తూ ,జీవిస్తున్న అయ్యప్ప భక్తులు నిజంగా  ధన్యులు !పుణ్యాత్ములు కూడా ! పూజలు తెలియవు , పూజావిధానాలు అసలే తెలియవు !. శాస్త్రాలు , పురాణాలు  ,ధర్మాలు  ఇవి ,ఏవీ కూడా తెలియవు.! దేవుడు ఎలా ఉంటాడో ,ఎక్కడ ఉంటాడో?  కూడా తెలియదు..! తెలిసింది ఒక్కటే ! అయ్యప్పస్వామియే దేవుడు.!. శబరిమల అతడి కోవెల నివాసము..! గురుస్వాములే వారి మార్గదర్శకులు !.. వారిని "తూచా  "తప్పక అనుసరిస్తూ వారి ఆజ్ఞను శిరసావహిస్తూఈ మండలదీక్ష చేయడమే స్వాముల  జీవిత లక్ష్యం..! అంతే వారికి తెలిసింది ! ఎంత విశ్వాసమో మనకు అంత ఫలితాన్ని ఇస్తాడు దైవం  ! కదా !అదే ఒక్క నమ్మకం తో అయ్యప్పస్వామి భక్తులు ఏ ఆటంకం ఇబ్బంది ఎదురు లేకుండా విజయవంతంగా దీక్షలు ముగిస్తున్నారు ఏటా !! 

దేవుడు ఉన్నాడు.! నాలోనే! ,నాతోనే! నావెంటనే ,!నాయోగక్షేమాలు  చూస్తూ.! నన్ను నిరంతరం కనిపెడుతూ ఉంటాడు! అసలు ,నేనే దేవుణ్ణి !నేనే అయ్యప్పస్వామి ని  !"" అన్న నమ్మకం  ప్రతీ మనిషిలో యువతలో ,చిన్నా ,పెద్దా, ముసలి ,పేద, ధనిక బేధం లేకుండా, దీక్షలు తీసుకుంటూ చలికి చన్నీటికి ,వెరవకుండా ,ఏకభుక్తం,, పడి పూజలతో, నిత్య అర్చన పూజ లతో ఆనందంగా దీక్షను నిర్వహిస్తూ దైవకృపకు యోగ్యతను పొందుతున్న అయ్యప్పస్వామి భక్తులకు శతాకోటి ప్రణామాలు.!

ఎక్కడో ,అడవిలో, కొండల్లో, కొనల్లో ,పిలుపుకు అందనంత దూరాన ఉంటూ కూడా ,తనను నమ్మినవారిని ,తన భక్తులను అక్కున చేర్చుకుంటూ. వారి మనో వాంఛలను, శారీరిక ,మానసిక రుగ్మతలను తొలగిస్తూ వారికి కావలసిన  ఆరోగ్యాన్ని ,ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ,ధనాన్ని ,సంసారంలో అభ్యున్నతి నీ, ఇస్తూ , ఇలా శరణాగతి చేసేవారినందరిని తన కారుణ్య కటాక్ష వీక్షణాలతో సంరక్షిస్తూ.". మీకు నేనున్నాను !" ఎప్పుడూ మీకు తోడుంటాను ! భయపడే అవసరం ఏ మాత్రం లేదు  !""అంటూ తన భక్తులకు  సదా తాను స్వయంగా ,తొడునీడై ఉంటున్న  అభయప్రదాత మన అయ్యప్పస్వామి కి కోటికోటి ప్రణామాలు.! సాష్టాంగ నమస్కారాలు ఎన్ని చేసినా  ,చేస్తున్నా కూడా  ఆ,స్వామి రుణం తీర్చుకోలేం కదా ! స్వామీ , శరణు ! అయ్యప్పా శరణు ! శబరిగిరీషా శరణు! 

ఇలా నీ స్మరణ ,నీ దీక్ష ,నీ సేవ  ,నీ ఇరుముడి మోసే అదృష్టం ,నీ వేషధారణ , నీ మకరజ్యోతి దర్శనం ,నీ సుందర మంగళ విగ్రహ దివ్య దర్శనా భాగ్యాన్ని  సదా మాకు  అనుగ్రహిస్తూ, మమ్మల్ని కాపాడుకో , స్వామీ  !!అన్నెం  ,పున్నెం ఏమీ ఎరుగని అమాయక , అజ్ఞాన ,మానవ ప్రాణులం! నిత్యానిత్యం ,, సత్యాసత్యం  ,పాపం పుణ్యం ,ధర్మాధర్మాలు  ,ఇవి ,ఏవీ తెలియని మూడులము ! మూర్ఖులం! అన్నింటికీ మించి మహా పావులం  కూడా.  ! స్వామీ క్షమించి నీ సేవలో తరించే అవకాశం ప్రసాదించు ! స్వామీ ! అయ్యప్ప !  మమ్మల్ని ఇలాంటి దీక్షావైభవం  ఏటా ఇస్తూ, మా జీవితాలు పండించు ! నీపై చెదరని భక్తిని ,బుద్దిని, నమ్మకాన్ని అనుగ్రహించు ! సకల జనావళిని చల్లగా చూడు తండ్రీ ,! స్వామీ! అయ్యప్పస్వామి ! శరణు! శరణు !శరణు!

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...