Tuesday, January 5, 2021

శివోహం

శంభో!!!
గ్రహాలను సృష్టించావు... 
గ్రహణాలు పట్టిస్తావు.... 
ఇది నీ లీలా నీ మాయా... 
తెలియనైతిని తండ్రి ..
మహాకాళేశ్వరా మహాదేవా శంభో శరణు...

Monday, January 4, 2021

శివోహం

శ్రీరామ నామం ఎంతో రుచిరా...
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శివోహం

శంభో!!!యుగాంతాలయినా ఆగని పయనమిది...
నీ రచనలు చదవలేను...
నీ నాటకం నేను ఆడలేను...
తరచూ నీ ఆటలో ఓడిపోలేను...

మహాదేవా శంభో శరణు.. 

శివోహం

శంభో!!!నేను తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు... 
నాపై నీ అంతరంగమున ఏమున్నా నీ బిడ్డడను... 
నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... 
మహాదేవా శంభో శరణు...

హారేకృష్ణ

పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగ నేలా?

#శ్రీమదాంధ్రమహాభాగవతం
హారేరామ హారేకృష్ణ

Sunday, January 3, 2021

శివోహం

కమ్మని కల కన్నాను తండ్రి...
నా కనులు చాలా లేదు నీ కనుల కాంతి చూడా...

ఓం నమః శివాయ

శివోహం

ఆశగా వున్నాది శివా నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కనులార నినుచూసి ఈ జన్మ తరియించి పోవాలని...

కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...