జీవితం శ్రీ కృష్ణ భగవానుని రాస లీల వంటిది...
రాస లీల అంటే జీవిత నాటకం. అందులో నృత్యం, సంగీతం, పాట పద్యం, పద కదలికలు, రంగులు అన్ని కల గలిపి ఉంటాయి...
ప్రతి ఒక్కరు జీవితాన్ని పెదవులపై పాటలతో, మనసులో నవ్వులతో గడిపెయ్యాలి...
జీవితాన్ని సప్త వర్ణాల సమ్మేళనంగా గడపాలి...
బృందావనం కృష్ణుడు గడిపిన ఊహాజనిత పూల తోట కాదు...
అది ప్రతి వ్యక్తి నివసించే ప్రదేశం...
ఉత్తాహం, ఆనందం తో ఆ తోటను నింపేయాలి...
జీవితం మనం మలచుకునే దానిని బట్టే ఉంటుంది...
ఇష్టంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం నేర్చ్చుకుందాం...
ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః