Thursday, January 7, 2021

శివోహం

శివా! ఎరుక చేసెడి కన్ను ఎగువ కన్ను
నిత్య జ్యోతిగ వెలుగు నిలువు కన్ను
మరుగాయె నాలో విచ్చనిమ్ము .
మహేశా ..... శరణు.

శివోహం

నీలో ఉన్న తేజాన్ని నేను...
అహం చూపానో ఏమో...
నీ నుండి దూరం చేసి మాయ కప్పి
ఆటలాడుతున్నావు....
నిన్ను వీడి ఉండలేను...
ఈ జన్మల పరంపర ప్రవాహానికి
ఆనకట్టవేసి ఆదుకోవా...
నీ ఒడిని చేర్చుకోవా..
మహాదేవా శంభో శరణు...

శివోహం

నీలో ఉన్న తేజాన్ని నేను...
అహం చూపానో ఏమో...
నీ నుండి దూరం చేసి మాయ కప్పి
ఆటలాడుతున్నావు....
నిన్ను వీడి ఉండలేను...
ఈ జన్మల పరంపర ప్రవాహానికి
ఆనకట్టవేసి ఆదుకోవా...
నీ ఒడిని చేర్చుకోవా..
మహాదేవా శంభో శరణు...

Wednesday, January 6, 2021

శివోహం

మార్చేసావు నన్ను పూర్తిగా నీ ధ్యాసలో
మారిపోయాను నేను...
నువ్వే నేను గా...
చూస్తున్నా నీకోసం..
నన్ను నేను మరచి..
మహాదేవా శంభో శరణు...

శివోహం

జీవితం శ్రీ కృష్ణ భగవానుని రాస లీల వంటిది...
రాస లీల అంటే జీవిత నాటకం. అందులో నృత్యం, సంగీతం, పాట పద్యం, పద కదలికలు, రంగులు అన్ని కల గలిపి ఉంటాయి...
ప్రతి ఒక్కరు జీవితాన్ని పెదవులపై పాటలతో, మనసులో నవ్వులతో గడిపెయ్యాలి...
జీవితాన్ని సప్త వర్ణాల సమ్మేళనంగా గడపాలి...
బృందావనం కృష్ణుడు గడిపిన ఊహాజనిత పూల తోట కాదు...
అది ప్రతి వ్యక్తి నివసించే ప్రదేశం...
ఉత్తాహం, ఆనందం తో ఆ తోటను నింపేయాలి...
జీవితం మనం మలచుకునే దానిని బట్టే ఉంటుంది...
ఇష్టంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం నేర్చ్చుకుందాం...

ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః
హరే క్రిష్ణ హరే రామ

శివోహం

బ్రహ్మ, మురారి ముక్కోటి దేవతామూర్తులచే పూజలందుకునే దేవాదిదేవా... 
మహాదేవా... 
మా జన్మజన్మల పాపాలను, 
దుఃఖాన్ని తొలగించి... 
సుఖమయ జీవనాన్ని ప్రసాదించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

జీవితం శ్రీ కృష్ణ భగవానుని రాస లీల వంటిది...
రాస లీల అంటే జీవిత నాటకం. అందులో నృత్యం, సంగీతం, పాట పద్యం, పద కదలికలు, రంగులు అన్ని కల గలిపి ఉంటాయి...
ప్రతి ఒక్కరు జీవితాన్ని పెదవులపై పాటలతో, మనసులో నవ్వులతో గడిపెయ్యాలి...
జీవితాన్ని సప్త వర్ణాల సమ్మేళనంగా గడపాలి...
బృందావనం కృష్ణుడు గడిపిన ఊహాజనిత పూల తోట కాదు...
అది ప్రతి వ్యక్తి నివసించే ప్రదేశం...
ఉత్తాహం, ఆనందం తో ఆ తోటను నింపేయాలి...
జీవితం మనం మలచుకునే దానిని బట్టే ఉంటుంది...
ఇష్టంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించటం నేర్చ్చుకుందాం...

ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః
హరే క్రిష్ణ హరే రామ

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...