Saturday, January 9, 2021

శివోహం

తొలి మెట్టు జ్ఞానం...
మలి మెట్టు భక్తి...
చివరి మెట్టు వైరాగ్యం...
జ్ఞాన, భక్తి, వైరాగ్యము లు మెట్లు అయ్యాక...
నీ పంచన చోటు దొరక్కపోతుందా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో ! మనసు నీపై పెట్టి... 
కాసిన్ని నీళ్లు నీ నెత్తిన పోస్తే చాలు కరుణిస్తావట కదా...
మరి నేను నిన్నే నా మనసులో పెట్టి... 
నిత్యమూ స్మరిస్తన్నాను ధ్యానిస్తూఉన్నాను...
దయచూడు తండ్రీ...

మహాదేవా శంభో శరణు...

Friday, January 8, 2021

శివోహం

భక్తి అనేది  తెచ్చి పెట్టుకునే వస్తువేం  కాదు
అది జన్మతహా  ఆత్మలో నిక్షిప్తమై నీవు ఎదిగే
కొలది అదీ ఎదిగి వృక్షమై నిను రక్షించి  సేద
తీర్చి హరి సాయుజ్యమౌవ్వాలి...

ఒకరి  భక్తిని  హేళన  చేసినా వాని  మనసును  
నొప్పించినా వాని ఆత్మలో కూడా నీ ఆరాధ్య   
దైవమే నివసించునని  యెరుగు...

నా మాట వినక నీ ధోరణే  నీదైతే ముక్తి కై పోరాడు  నీ శ్రమను  పరమాత్మ  స్వీకరించడు...
అధోగతి  పాలగుదువు...
తెలుసుకుని మసలి   మనుగడ  సాగించవే  
మతిలేని  నా  మనసా....

హరే గోవిందా

శివోహం

శంభో!!!
నేను అబద్ధం...
నువ్వు నిజం...

శివోహం

నా శ్వాసే నీవన్న ఎదో ఓ రోజు ఊపిరి తిస్తావు...
నేను బ్రతుకేది నీకోసమన్నా చివరికి చితినే పెరుస్తావు...
నా సొంత వాళ్ల కోసం ఎన్ని కలలు కన్నా కల గానే మిగిలిస్తావు...
చివరకి అన్ని బంధాలు తెంచుకోని నీ దగ్గరికి రమ్మంటావు...
నీ లీలలు తెలియ నా తరమా తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Thursday, January 7, 2021

శివోహం

శంభో ! సర్వ జ్ఞానివి... 
సమస్త లోకాలను ఏలే వాడవు... 
సకల శుభాలను ఇచ్చేవాడవు... 
సకలమూ ఎరిగిన వాడవు... 
సమస్తమూ వ్యాపించిన... 
ఆనంద తాండవ నటరాజా... 
మాత బాలాత్రిపురసుందరిదేవితో 
కూడి నాకు జ్ఞానఐశ్వైర్యాన్ని ప్రసాదించుము... 
నన్ను అనుగ్రహించుము తండ్రీ... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

అదుపు లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదం...
అందుకే ఆలోచనలు అదుపులో ఉండాలంటే శివ నామ స్మరణతోనే సాధ్యం...

ఓం నమః శివాయ..

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...