Monday, January 11, 2021

శివోహం

కండ్ల ఆర్తి కన్నీరై ఇంకి ఆవిరై ఇంకా నీరేమీ లేదని చూడకు శివా...
హృదయ వేదన జలం తోడితే సాగరం కూడా చిన్నపోతుంది...

మహాదేవా శంభో శరణు...

Sunday, January 10, 2021

శివోహం

నీ సేవకై నే వచ్చాను...
నీ రూపం నే కంటున్నా...
నీ మాటలు వింటున్నా...
నీలో నేను కలుపుకో...
పరమేశ్వర!
నీవే సర్వము నా మదికి...
నిను వీడి నే ఉండలేను...
కరుణించు మహాదేవ...
శరణు కోరిన నాకు...
ముక్తినివ్వు మహాదేవ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!జనన మరణాల జరీమానాలు 
సుంకాల చెల్లింపులు  ఇంక చెల్లిపోనీ
టంకమేసి నీ సన్నిధి నిలిచిపోనీ
మహేశా . . . . . శరణు .

శివోహం


రామ నామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం...

రామ నామం త్రిమూర్తులకు ప్రతీక...

రామ నామం మోక్షదాయకం,మోక్షకారకం....

జై శ్రీరామ్ జై జై హనుమాన్...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!జనన మరణాల జరీమానాలు 
సుంకాల చెల్లింపులు  ఇంక చెల్లిపోనీ
టంకమేసి నీ సన్నిధి నిలిచిపోనీ
మహేశా . . . . . శరణు .

Saturday, January 9, 2021

శివోహం

మనసెప్పుడూ రగిలే అగ్నిగోళమే...
కోరరానివి కోరుతూనే ఉంటుంది...
కళ్ళలో నీ రూఫు కరిగిపోనీకుండా...
మనసులో సదా నువ్వే నిలిచిపో...
మహాదేవా శంభో శరణు...

శివోహం

తొలి మెట్టు జ్ఞానం...
మలి మెట్టు భక్తి...
చివరి మెట్టు వైరాగ్యం...
జ్ఞాన, భక్తి, వైరాగ్యము లు మెట్లు అయ్యాక...
నీ పంచన చోటు దొరక్కపోతుందా...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...