Sunday, January 17, 2021

శివోహం

నా తల్లితండ్రుల గురించి ఏం చెప్తం...

ఎండల్లో ఎండిపోతూ,వానల్లో తడిసిపోతూ
స్మశానాల్లో బతికే రకము...

అమ్మ తనువంతా సుగంధ లేపనాలు...

నా తండ్రి శివయ్య ఒంటి నిండా బూడిద గీతలు...

అమ్మ చేతులకు వంకీలు...

తండ్రి చేతులకు పాము పిల్లలు....

ఎక్కడా పొంతనే లేదు...

ఎన్ని యుగాలు గడిచినా ఆది ప్రేమికులు ఆది దంపతులుగా వర్ధిల్లుతూనే ఉన్నారు పర్వతిపరమేశ్వరులు...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, January 16, 2021

అమ్మ దుర్గమ్మ శరణు

అమ్మ
జగన్మాత
రాజేశ్వరి
పరమేశ్వరీ
జగదీశ్వరీ
దుష్ట సంహారిణి
పాప హరని
శరణు కోరితి 
నీ దరిచేర్చుకోవమ్మ కనికరం చూపి........
అమ్మ దుర్గమ్మ శరణు...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శంభో!!!"కర్మ"లు...
మూట గట్టి...
అనుభవించ మని...
వెంటబెట్టీ...
తోలితివా తండ్రీ....

శివోహం

హరహర....
పురహర...
భవహర...
కరుణాకర....
చంద్రచూడ ఖట్వాంగ ధరా....
పరమేశ! నిన్నే నమ్మితి సత్యం....
త్రెంచుము భవ బంధములను....
మోగించు నీ ఓంకారమును నా మనసును.....

మహాదేవా శంభో శరణు...

Friday, January 15, 2021

శివోహం

ఈ తనువు గతమెన్నో జన్మలనుండి నీ వెంట పడినా...
ఈ జన్మములో నీవెవరివో అర్ధమయింది...
అందుకే ఆతురత నిన్ను కలవాలని...
నీతో ఉండిపోవాలని, నీ పంచన నిలవాలని...
మనసు  తహతహలాడుతుంది...
మహాదేవా శంభో శరణు...

హరే గోవిందా

అన్ని మంత్రములు
సకల చరాచర జీవ రాశులు నీవై ఉన్నావు తండ్రీ...
ఆది అంతమూ నీవై ఉన్నావు...
నడుమ ఆచరించచే కర్మలకు మనసు బానిస కాకుండా... వశ్యము కాకుండా...
ఊరట కలిగించేది..  
నీ నామస్మరణే తండ్రీ....

ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో ! సమస్త జీవకోటిని 
ఆదరించి అనుగ్రహించే మహదేవా... 
పరమదయామయా...
భక్తవత్సలా... 
నాలోని లోపాలు తొలగించి... 
పాపాలు నశింపజేసి... 
నీ దివ్యానుగ్రహం అందించు... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.