Wednesday, January 27, 2021

శివోహం

ఎందెందు వెతికిన అందదు కలడు నా సామి...
చెట్టు చెమ
గట్టు పుట్ట
మనసు పెట్టి వేతకాలే కానీ....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

గమ్యం చేరడానికి ఎంత దూరమైన
నడవాలని ఉండాలే గాని ఈ కాళ్ళు చాలు ...

బాద అయినా సంతోషం అయినా 
భరించేందుకుగుప్పెడు గుండె చాలు ...

నా జీవితం సంతోషంగా ఉండాలంటే...
నీ చల్లని కారుణకటాక్షాలు చాలు.....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో!!!
నీపైన అపార నమ్మకం తో ఈ సంసార సాగరం ఈదుతూ...
నిత్యం నిన్ను ధ్యానించు కొంటూ...
కర్తవ్య నిర్వహణలో తలమునకలై ఉన్న నన్ను మరచి ఏమార్చి వెళ్ళవు కదా...
తండ్రి!!!
ఆ స్మశానం లో బంధుమిత్రులు వదిలి వెళ్ళాక...
నీ సాంగత్యం నాకు దొరుకుతుందనే ఒకే ఒక ఆశతో కాలాన్ని వెళ్ళదీస్తున్నాను...

మహాదేవా శంభో శరణు...

Tuesday, January 26, 2021

శివోహం

మెతుకు మెతుకులో నీనానామమే కనిపిస్తుంది...
బతుకు బాటలో నీవు నాకు ఇచ్చిన ప్రసాదగా భావించి 
శివా శివ శివా అనుకుంటూ శివార్పణం గా సేవించు భాగ్యం ప్రసాదించు పరమేశ్వరా...
ఈరూపంగా నాలో అంతరంగ ఉన్న పరబ్రహ్మవు నీవు నాకు నీవిచ్చిన ఆహార నీకే అంకితం...

మహాదేవా శంభో శరణు...

Monday, January 25, 2021

శివోహం

గుండె బరువుగా ఉన్నప్పుడు.  
శివ నీ నామం తలవగానే...
నా గుండె బరువు తగ్గి మనసు చల్లబడుతుంది...
నా తనువు కైలాసం అవుతుంది...
మహాదేవా శంభో శరణు...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రాణాలు కాపాడే సైనికులకు...
పోలీసులకు వందనం...

ఆకలి తీర్చే కర్షకులకు(రైతులకు) వందనం...

భరతమాతను...
తెలుగుతల్లిని...
దేశానికి గౌరావాన్నిచ్చే ...
సోదరి సోదరులకు మాత్రమే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....

*చేయి చేయి కలుపుదాం కులమతగజ్జికీ ప్రరాదొలుదాం...*

జై జవాన్... జై జై కిసాన్

శివోహం

శరణాగతి నీవే తండ్రీ..
నిను మించిన ఆలోచన కానీ..
నీపదకమలాన్ని మించిన లక్ష్యం కానీ మరోటిలేదు తండ్రీ..
హేయమైన శారీరక వాంఛలూ.....
అశాశ్వతబంధాలనే మాయలో పడకుండా నను నీ దరిచేర్చుకోవయ్యా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...