Friday, January 29, 2021

శివోహం

నిన్ను కొలిచేవాడికి...
సంపదలపై మోజుకన్నా...
నిను చూసి తరించాలనే కోరిక కలుగుతుంది...
నిత్య సంపదలకన్నా శాశ్వత సంపదలు...
ప్రధానమని తెలుసుకొనేలా చేస్తావు...
నీదారిలో నడిచేవాడికి తోడూనీడా నీవే కదా శివా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అంబ జగదాంబ...
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము...
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి...

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

బలం నీవు...
బలహీనత నీవు...
కల నీవు...
కలం నీవు...
మతి నీవు...
గతి నీవు...
గతం నీవు...
కృతం నీవు...
స్వరం నీవు..
సర్వం నీవు...

మహాదేవా శంభో శరణు...

Thursday, January 28, 2021

శివోహం

మూసి ఉన్న నా కనులకు చూపావు...
ఎన్నో అద్భుత దృశ్యాలు..
నిన్ను తలచిన ప్రతి నిమిషం...
ఏదో తెలియని ఉద్వేగం ...
రెక్కలు కట్టుకు వచ్చి....
నిన్నే చూడాలని ఆరాటం...
కలలో అయిన వీడను నీ దివ్య రూపం ...

మహాదేవా శంభో శరణు....

శివోహం

ఊరు ఏదైనా నాకున్నది నీవే శివ...
శివుడు లేని ఊరు చొరబడకు అని సామెత...
శివాలయం లేని ఊరు నాదని చిన్నచూపు చూడకు...
నా హృదయమే నీకు ఆలయం అందులో నీవే కొలువు దిరి నిత్య పూజలందుకో...
నా ఆవేదనను నీకు నివేదనగా సమర్పిస్తా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, January 27, 2021

శివోహం

ఆకాశాన్ని తాకినవాడు లేడు...
శివలింగ స్వరూపం తుది చూసినవాడు లేడు...
నింగిలో తారలను లెక్కించినవాడు లేడు...
వెన్నెల వెలుగు అనుభవించేవేళ నేలను చూసినవాడు లేడు...
ఇన్ని అందాలను మా మదిలోనే నింపి నీ నామంతో మాచే నిత్యాభిషేకం చేయించుకుంటున్నావు...

నీకరుణ కోరుకుంటూ
మహాదేవా శంభో శరణు...

శివోహం

అజ్ఞానం అనే చీకట్లను తొలిగి......
జ్ఞానమనే జ్యోతులను వెలగలంటే.....
అయ్యప్ప నమస్మరణతోనే సాధ్యం...

ఓం శివోహం.... సర్వం శివమయం.....
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...