Sunday, January 31, 2021

శివోహం

కాలుతున్న ఇంటినుండి...
మునిగిపోతున్న పడవనుండి...
బయట పడటానికి ఎంత ఆత్రం చూపిస్తామో...
ఈ సంసారమనే సుఖదుఃఖ వలయంనుండి బయట పడటానికి భగవన్నామాన్ని గమ్యంగా చేసుకుని ఆత్రంగా సత్య నిష్టతో నమ్మకంతో నిరంతర సాధన చేయాలి...
అంత ఆయనే(పరమాత్మ) చూసుకుంటుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, January 30, 2021

శివోహం

శంభో ఏముంది కొత్త....
నీకు ఆటలాడుకోవడం అలవాటు...
నాకు భరించడం అలవాటు...
ఐనా సరే నీ ధ్యానం  వదలను...
నిన్ను  సేవించడం వదలను...
నిన్ను  విడిచి వెళ్ళను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అంజనీ పుత్ర ఆంజనేయ...
వీరధీ వీర అచెంచల భక్తి కలవాడా...
రామభక్తా హనుమా నీ భక్తి కి నీ  గుండెల్ని చీల్చి ఇరువురు(తల్లిదండ్రులను) నీ గుండెల్లో చూపించి నీ అమోఘమైన భక్తిని చూపించి తండ్రి మెచ్చుకోలు పొంది యున్నావు...
అంజనీపుత్ర నీ కరుణ కటాక్షాలు మాకు కలగజేయవయ్య....

జై శ్రీరామ్ జై జై హనుమాన్

శివోహం

మోదక ప్రియ
మంగళ దాతా గజవదనా.. 
గణనాయక
శంకర పార్వతి నందనా
సహస్ర ముకుట పీతాంబర
శంభోసుత లంబోదర శరణు...

ఓం గం గణపతియే నమః

శివోహం

తప్పులు చేసినా
తప్పటడుగులు వేసినా
హరి నీ నామం మరువలేదు ఎన్నడు స్వామీ...

గోవిందా గోవిందా

Friday, January 29, 2021

శివోహం

నిన్ను కొలిచేవాడికి...
సంపదలపై మోజుకన్నా...
నిను చూసి తరించాలనే కోరిక కలుగుతుంది...
నిత్య సంపదలకన్నా శాశ్వత సంపదలు...
ప్రధానమని తెలుసుకొనేలా చేస్తావు...
నీదారిలో నడిచేవాడికి తోడూనీడా నీవే కదా శివా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అంబ జగదాంబ...
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము...
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి...

ఓం శ్రీమాత్రే నమః

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...