Friday, February 12, 2021

శివోహం

గుండెను చూడు...
గుండెలో గూడు కట్టుకున్న గంగాధరుని చూడు...
వేదనగావేడుకోగానే...
నేత్రముల దారి చూసుకుని వచ్చేస్తాడు పరమ శివుడు

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అరిషడ్వర్గములతో
శరణు వేడితి శరణు శరణు అని...
కోరితి నీ కరుణ....
చేరితి నీ దరి కృపజూడు తండ్రి...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, February 11, 2021

శివోహం

సర్వ పాప హరుడవు.... 
సర్వ దుఃఖ హరుడవు... 
సర్వ భయ హరుడవు.... 
సర్వ రోగ హరుడవు.... 
ఐశ్వర్య కారకుడవు.... 
ఆనంద కారకుడవు...
శుభ కారకుడవు...
తేజో కారకుడవు...
హర హర మహా దేవ శంభో శంకర .....
శివోహం......సర్వం శివ మయం.

శివోహం

చీకటి తరువాత వెలుతురు...
చెడు నుండి మంచికి....
మంచి నుండి మానవత్వానికి...
మానవత్వం నుండి దైవత్వానికి...
వాల్మీకి ని కన్నప్పల మాదిరి నన్ను కూడా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, February 10, 2021

శివోహం

కుడి ఎడమ కనుల...
నిను మనసారా కాంచితిని...
నోరారా కీర్తించితిని...
భజనలు చేసితిని...
ఉదయం నుండి సాయంత్రం వరకూ నేతిరిగిన అన్ని ప్రదేశాల నిన్ను ఆరాధించితిని...
రాత్రికి నిన్ను గుర్తు చేసుకుంటూ ఆరెండు కనులు మూసి...
బయట నేతిరిగిన నిమిషాలు మూడవ నేత్రంతో కాంచుకునేలా...
లోపల క్షణాలుగా నిన్ను తలంచు చున్నాను...
లోపలనుండి నీవెలుగుతో నన్ను నడిపించవా శివా...
పగలు మెలకువలో రాత్రి నిదురలో అనునిత్యం నీ స్మరణే నాకు శరణ్యం...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కళ్ళు తెరిపించి
ఆశలు పెంచేదీ నీవే
అవే కళ్ళు మూపించి 
శ్వాసలు తెంచేదీ నీవే 

కట్టె కొనల 
మోక్షానివీ నీవే  
కైలాస శిఖరమే
సాక్ష్యమని చెప్పే దైవానివీ నీవే

శివోహం  శివోహం

శివోహం

కళ్ళు తెరిపించి
ఆశలు పెంచేదీ నీవే
అవే కళ్ళు మూపించి 
శ్వాసలు తెంచేదీ నీవే 

కట్టె కొనల 
మోక్షానివీ నీవే  
కైలాస శిఖరమే
సాక్ష్యమని చెప్పే దైవానివీ నీవే

శివోహం  శివోహం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...