Sunday, February 14, 2021

శివోహం

శివా!ఈ తనువు శిధిలమై దగ్ధమైపోగా
జీవాత్మ నిను జేరి తిలకించునపుడు
తిరిగంపకయ్యా ఏ తనువు దాల్చ
 మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!చిన్న మాట పట్టుకొని స్మరణ చేస్తున్నాను
పెద్ద బాట పట్టుకొని నిన్ను వెతుకుతున్నాను
వెలుగు చూపవయ్యా వెతలు బాపయ్యా
మహేశా . . . . . శరణు .

శివోహం

       మనిషి మనసుకి బానిస...
       మనసు మాయకి బానిస...
       మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని               పట్టుకుంటే మాయ తొలగుతుంది....
       ఓం శివోహం... సర్వం శివమయం
                                    మోహన్ నాయక్ వాంకుడోత్

Saturday, February 13, 2021

శివోహం

ఆదిదంపతుల ప్రేమకు సాటిలేదు ఒకరు వాక్కు ఒకరు భావం...
ఒకరు జ్యోతి ఒకరు వెలుగు...
ఆదిదంపతుల ప్రేమకు మనమందరం వారసులం వారే మనకు ఆదర్శం...
ఒకరోజు ప్రేమ మనకొద్దు...
నిత్యము ప్రేమ గుబాళించే మనసాంప్రదాయానికి మనం నమస్కరిద్దాం....

జై శ్రీరామ్

హనుమా...
నీ దయ అపారం...
నీ అనుగ్రహానికి నోచుకున్న నేను ఎంతో భాగ్య శాలిని...
నిన్ను కీర్తించడం మరిచాను స్వామీ...
అందుకే నా స్వామి కలలో దర్శనం ఇచ్చావు...
వాయు పుత్రా
అంజనీ తనయా
హే రామ దూతా
వీర హనుమా
అభయ ప్రదాతా
శ్రీరామ భక్తా హనుమా శరణు...

శివోహం

నేడు నిన్నగా లేకపాయే
రేపు నేడుగా మారదాయే
మరి ముందు గురించి 
చింత యేల,ఎవరిని ఎంచ్చక
నీ నామమే మాకింక శరణు
గోవిందా గోవిందా గోవిందా

శివోహం

దేహమనే దేవాలయంలో
హృదయమనే గర్భగుడిలో
ఆత్మస్వరూపమై పరమాత్మా వెలసియున్నాడు.
ఆ పరమాత్మా దర్శనం కావాలంటే,
అజ్ఞానం అహంకారమనే తెరను తొలగించాలి. సోహం భావముతో పూజించాలి.
ఓం శివోహం... సర్వం శివమయం
*VMN*

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...