Tuesday, February 23, 2021

శివోహం

శివుడు ఒక్కడే మీ కలలను నిజం చేయగలడు...
మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు అతనితో మాట్లాడడమే(ప్రార్ధించడమే)....
ఓం నమః శివాయ

శివోహం

ఏది ఉన్నా నాది అనుకోకు...
నీది కానిదాని నెవ్వరు దోచుకోలేరు...
నాది నాదని పలవరిస్తే...
ఏది నీదిగ మిగలబోదు...
ఏది ఉన్నా మమత వీడితే...
నీది కానిది ఏది ఉండదు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఎత్తిన పాదం దించకుండా...
నా శిరస్సుపై పెట్టు తండ్రి...
నా నరనరల్లో పేరుకుపోయిన అహం స్వార్థం...
కామ క్రోధ లోభా మోహ మధ మత్చర్యాలు తొలిగిపోయేట్టు తొక్కిపెట్టు...

శ్రీహరి శరణు...

శివోహం

ఏది ఉన్నా నాది అనుకోకు...
నీది కానిదాని నెవ్వరు దోచుకోలేరు...
నాది నాదని పలవరిస్తే...
ఏది నీదిగ మిగలబోదు...
ఏది ఉన్నా మమత వీడితే...
నీది కానిది ఏది ఉండదు...
ఓం శివోహం... సర్వం శివమయం

Monday, February 22, 2021

శివోహం

కలిమయాలో లో ఉన్న...
కల్తీ మనసుల మధ్య ఉంటూ...
కలుషిత మాయెను మనసు...
నీ సేవలేల చేయగలను...
నీ కేమిచ్చి  మెప్పించగలను...
సర్వం నీవే సకలం నీదే కదా శివ...
కనుకట్టు తొలగించు కనుపిప్పు కలిగించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీటిలోన నీవే...
నింగి లోన నీవే...
చెట్టు లోన...
పుట్ట లోన...
నాలోన...
నీ లోనా...
ఇటు చూసినా...
అటు చూసినా...
అంతా నీవే...
అంతటా నీవే
శివా నిన్ను చూసేందుకు ఈ కళ్ళు చాలవుగా...
మహాదేవా శంభో శరణు

శివోహం

నిమిషం, గంటలు, రోజులు,వారం, నెలలు సంవత్సరాలు అతని మనసు కరిగేంత వరకు  ప్రార్థిస్తూనే ఉండు...
అతనొక్కడే నీ గుండె దడ వినేవాడు దాని వెనుక  బాధను తీర్చేవాడు...

ఓం నమః శివాయ

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.