Friday, February 26, 2021

శివోహం

నీవు లేక జగతి లేదు....
జనహితం లేదు సర్వం నీవే....
నీవు లేక సుగతి లేదు... 
సుచరితం లేదు అన్నింటా నీవే....
ప్రాణం పోసేది నువ్వే....
ఆ ప్రాణం ను తీసేది నువ్వే.....
ఆట నీదే ఆడేది నువ్వే చివరికి గెలుపు నీదే...

మహాదేవా శంభో శరణు...

Thursday, February 25, 2021

శివోహం

మధురా భాషిని
మంజుల రూపిణి
అంబర వేణి వీణాపాణి
ఓంకారము నీ నాద స్వరూపము
హ్రీంకారము నీ శక్తి స్వరూపము
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః
ఓం దుర్గాదేవినే నమః

శివోహం

శివాలయం లేని నా ఉరని చిన్న చూపు చూడకు...
పూజగది లేని అద్దె ఇల్లు నాకే ఇరుకుగా ఉందని తొంగిచూసి గుమ్మం నుంచే వెళ్లిపోకు...
పై రెండు కన్నా నా హృదయం చాలా విశాలమైనది...
నా గుండె గూటినే కైలాసం చేసుకో పరమేశ్వరా...
కష్టాల కడలి దుఃఖం తో ఉబికి వస్తున్న నా కన్నీటి జలం తో నిత్యం అభిషేకించుకో...

మహాదేవా శంభో శరణు....

శివోహం

మనిషికి నిజమైన ఆప్తుడు...
తన బంధువు,తలిదండ్రులు, భార్యా, భర్త,సంతానం, స్నేహితులు కానే కారు...

మనలో ఉంటూ, మన మనుగడకు కారణంగా చరిస్తూ ఉంటున్న మన మనసే మనకు ఆప్తుడు ఆత్మీయుడు...


ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, February 23, 2021

ఓం గం గణపతియే నమః

మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర
వామనరూప మహేశ్వర పుత్ర
విఘ్నవినాయక పాద నమస్తే.

శ్రీరామ

శ్రీరామ నీ నామం షడ్రుచులను మరిపించునంత తియ్యగా ఉంటుంది...
అందుకే అంటారు కాబోలు రాముడి కన్నా రామ నామమే గొప్పది అని....

శ్రీరామ శరణు...

శివోహం

ఓ శివా! పరమేశ్వరా! ఆదిభిక్షూ! 
నా మనస్సు అనే కోతి ఎల్లప్పుడు...
మోహమనే అడవిలో తిరుగుతూ....
కామము అనే కొండలపై విహరిస్తూ....
ఆశలనే కొమ్మలపై ఆడుతూ ఉంటుంది.....
అత్యంత చపలమైన ఈ కోతిని.....
భక్తి అనే త్రాటితో గట్టిగా కట్టి....
నీ అధీనములొ నుంచుకొనుము...
మహాదేవా శంభో శరణు....

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.