Sunday, February 28, 2021

శివోహం

శివోహం

శంభో....
సమస్తలోకాధిపతివైన నీవు దయాసముద్రుడవై నన్ను రక్షించుచుండగానాకు ఇతర దైవ చింతనలతో పనేమి...

నా చింతలను పోగొట్టే సర్వాంతర్యామివి నీవే అయినపుడు నాకు ఇతర చింతలేల...

మహాదేవా శంభో శరణు....

శివోహం

శంభో!!!మిడి మిడి జ్ఞానంతో
అర్ధంపర్థం లేని భావాలను చూడకు తండ్రి...
గుండె లోతులో దాగిఉన్న భక్తిని మాత్రమే చూడు...
నిన్ను అభిషేకించడం కోసం బాధవెనుక....
రుధిరం దాచుకున్న ప్రేమను చూడు... ..

మహాదేవా శంభో శరణు

Saturday, February 27, 2021

శివోహం

అహమే జన్మలకు మూలమన్నారు పెద్దలు...
అందుకే ఆ అహం తొలగాలంటే...
త్రికరణశుద్దిగా గురువు ను  నమ్మాలి....
చిత్తశుద్దిగా గురుదేవుని పాదాలు పట్టాలి...
పాదసేవచేసి గురుదేవుని దయని సంపాదించాలి...
ఉన్నది ఎదో ఎదో లేనిది ఎదో..
అసలు ఎదో నకలు ఎదో ఎరుక తెలుసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నీవే వేదం...
నీవే విశ్వం...
నీవే సత్యం...
నీవే తత్త్వం...
నీవే బంధం...
నీవే భావం...
నీవే సర్వం
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నారాయణ చరణౌ మనసా స్మరామి
నారాయణ చరణౌ శిరసా నమామి

Friday, February 26, 2021

శివోహం

ఆర్తనాదాల నడుమ...
తల్లిదండ్రుల బంధు మిత్రుల రొదలతో...
మా బాధ్యత తీర్చుకుని వచ్చేసాకా...
ఇక నీ బాద్యతే కదా తండ్రి...

మహాదేవా శంభో శరణు
నీవే శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...