Monday, March 1, 2021

శివోహం

ఉండలేను నిన్ను విడిచి..
ఉండలేను నిన్ను మరచి...
నీతో నేను...
నాతో నువ్వు....
నీలో నేను...
నాలో నువ్వు...
పంచ భూతాల సాక్షిగా నువ్వే నేను నేనే నువ్వు....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో!!!
బతుకు పోరులో నేను దారి(ధర్మం)తప్పలేదు... 
భక్తి బాటలో నీ దారి(శివసేవ)మరువ లేదు... 
నీ కింకరున్ని తండ్రి దయచూపు... 

మహాదేవా శంభో శరణు...

Sunday, February 28, 2021

శివోహం

శివోహం

శంభో....
సమస్తలోకాధిపతివైన నీవు దయాసముద్రుడవై నన్ను రక్షించుచుండగానాకు ఇతర దైవ చింతనలతో పనేమి...

నా చింతలను పోగొట్టే సర్వాంతర్యామివి నీవే అయినపుడు నాకు ఇతర చింతలేల...

మహాదేవా శంభో శరణు....

శివోహం

శంభో!!!మిడి మిడి జ్ఞానంతో
అర్ధంపర్థం లేని భావాలను చూడకు తండ్రి...
గుండె లోతులో దాగిఉన్న భక్తిని మాత్రమే చూడు...
నిన్ను అభిషేకించడం కోసం బాధవెనుక....
రుధిరం దాచుకున్న ప్రేమను చూడు... ..

మహాదేవా శంభో శరణు

Saturday, February 27, 2021

శివోహం

అహమే జన్మలకు మూలమన్నారు పెద్దలు...
అందుకే ఆ అహం తొలగాలంటే...
త్రికరణశుద్దిగా గురువు ను  నమ్మాలి....
చిత్తశుద్దిగా గురుదేవుని పాదాలు పట్టాలి...
పాదసేవచేసి గురుదేవుని దయని సంపాదించాలి...
ఉన్నది ఎదో ఎదో లేనిది ఎదో..
అసలు ఎదో నకలు ఎదో ఎరుక తెలుసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నీవే వేదం...
నీవే విశ్వం...
నీవే సత్యం...
నీవే తత్త్వం...
నీవే బంధం...
నీవే భావం...
నీవే సర్వం
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...