Friday, March 5, 2021

శివోహం

*భగవంతుని చూద్దాం పడండి*

ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు. చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునేవాడు. ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు- “రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.”

అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు- “భగవన్, నా దగ్గర నీవు ఇచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖసంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే- మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికి దర్శనాన్ని ఇవ్వండి.”

 భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు... ” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుదల బట్టి “ఈ కోరికను తీర్చ వలసిందే.” అన్నాడు భగవంతుడు చివరకు భక్తుడి ముందు వంగక తప్పలేదు. 

ఆయన అన్నాడు- “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుని, మరుసటిరోజు నగరంలో దండోరా వేయించాడు. “రేపు అందరూ కొండ దగ్గరకు నాతోపాటు వచ్చి చేరవలసింది. అక్కడ భగవంతుడు మీకందరికీ దర్శనం ఇస్తాడు.”

 రెండవ రోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు. అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు అందరిని సమాధానపరచి,

“అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు. ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణ్యాల ఆశలో పడి మీ అదృష్టాన్ని కాల తన్ను కోకండి.” అన్నాడు.

కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణాలను మూటకట్టుకుని, తమ ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళు మనసులో అనుకున్నారు- మొదలు ఈ రాగి నాణాలను ఇల్లు చేర్చుకుందాము. భగవంతుడిని తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని.

 రాజు ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు. వెండి నాణేల మూట కట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో తెలియదు.. భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’

 ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది. ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే పరుగెత్తడం మొదలుపెట్టారు. వాళ్లు ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్లి పోయారు.

 ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ జనాలు ఎంత ఆశపోతులో! భగవంతుడు లభించటం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు. భగవంతుడు ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే.” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. 

వారిద్దరూ ముందుకు సాగారు. కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది. ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నీ మూట కట్టుకోవటం ప్రారంభించింది.
అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.

  నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు-

 “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ బంధువులు? నేను ఎప్పటి నుంచి ఇక్కడే నిలబడి వారి కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.”

రాజు చాలా సిగ్గుతో ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు-

 “ఓ రాజా, ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను. వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు.”

 ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

ఓం నమః శివాయ



ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా, ఒక పులిని చూసి పారిపోసాగింది. పులి బారినుండి తప్పించుకోవడానికి ఆ ఆవు ఒక నీళ్ళులేని, బాగా బురదగా ఉన్న చిన్న చెరువులో దూకేసింది. 

ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ తమకంలో ఆ బురదగా ఉన్న చెరువులో దూకేసింది. ఆ రెండు ఆ నీళ్ళు లేని బురదతో ఉన్న చెరువులో,  ఎంత ఒకదాని మీద ఒకటి పడ్డా.. ఆ చెరువులో నుండి బయట పడటం వాటి వల్ల కాలేదు.

పులి ఆవుని చూసి, ” ఇప్పుడు నీ ఎముకలు పరపరా నమిలేయాలని ఉంది ” అన్నది.

ఆ పులి ఆవు పైకి పంజా విసరాలని శతవిదాల ప్రయత్నించి విఫలమైంది. ఆ బురదలో నుండి తప్పించుకోలేక నిస్సహాయురాలైంది.

అప్పుడా ఆవు పులిని చూసి నవ్వి, ”నీకు యజమాని ఎవరైనా ఉన్నారా? అనడిగింది

పులి , ” ఏం మాట్లాడుతున్నావు. ఈ అడవికి యజమానిని నేనే !! నువ్వెందుకు అలా అడుగుతున్నావు. నాకు నేనే కదా యజమానిని ” అని గర్వంగా గర్జించింది.

అప్పుడా ఆవు ” నువ్వీ అడవికి రాజువే కావచ్చు. కానీ ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నావు కదా” అన్నది

పులి..  నీ పరిస్థితి అంతే కదా !! నువ్వు ఈ బురదలో కూరుకుని ఉన్నావు కదా !! ఆకలితో చస్తావు కదా ” అన్నది.

అప్పుడా ఆవు ” నేను చావను. ” అన్నది.





” ఈ అడవికి రాజునైన నేనే ఈ బురదలో కూరుకుని పోయి బయటకు రాలేక పోతున్నాను. నువ్వొక సాధుజంతువైన నిన్ను ఎవరు రక్షిస్తారు ” అన్నది పులి.

” నిజమే !! నన్ను నేను రక్షించుకోలేను. కానీ నా స్వామి నన్ను రక్షిస్తాడు. సూర్యాస్తమయం అవ్వడంతో నేను ఇంటికి చేరక పోవడంతో నన్ను వెతుక్కుంటూ వస్తాడు. నన్ను ఈ బురదనుండి పైకి లేపి నన్ను రక్షించి, మా ఇంటికి నన్ను తీసుకువెడతాడు. ” అని మధురంగా, మెల్లగా చెప్పింది.

పులి స్థబ్దురాలై, దిగాలుపడిపోయింది.

సూర్యాస్తమయం కాగానే, ఆవు చెప్పినట్లు, దాని యజమాని వచ్చి, ఆవు దురవస్థ చూచి, ఆ బురదలో నుండి దానిని పైకి తీశాడు. దానిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఆవు యజమాని దయపట్ల ఎంతో కృతజ్జత మనస్సులోనే చెప్పుకుంది. ఆవు దాని యజమాని, పులి దురవస్థకు చింతించారు. కానీ దాని దురహంకారం దానిని వారిని దగ్గరకు చేరనివ్వలేదు.

మనం ఆధ్యాత్మికంగా పరిశీలిస్తే, ఆవు శరణాగతి చేసినవాడికి ప్రతీక.

 పులి సామాన్య మానవునిలో ఉన్న అహంకారపూరిత మనస్సుకు ప్రతీక. 

యజమాని గురువు లేదా మన స్వామి. బురద మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆకర్షణలు, పులి ఆవును తరుముకు రావడం మన జీవిత పోరాటం అన్నమాట.

జీవిత పోరాటం అలసిపోయి, ఏమీ చేతకాక, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే దైవాన్ని ప్రార్దించడం కాక, మనకు స్వామి ఒకడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ అనుకుంటూ మనం ఆ స్వామికి శరణాగతి చేస్తే, దైవమయిన ఆ యజమాని జీవన సమరంలో మనం ఓడిపొతున్నప్పుడు , ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ”నేనున్నాను” అంటూ వచ్చి మనలను పంకిలం నుండి లేవదీసి అన్ని బంధాలనుండి విముక్తులను చేసి మోక్షం ప్రసాదిస్తాడు.

శివోహం

 ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

ఓం నమః శివాయ
VMRT

శివోహం

    ఏ ప్రాణులు తమ మనస్సు, బుద్ధి, అంతరాత్మతో          భగవంతుని శరణు వేడుతారో, ఎవరు లౌకిక            మోహాలను అన్నిటినీ విడిచి పరమేశ్వరుని తన         సొంతం అనుకుంటారో, వారు అన్ని కర్మల నుండి          విముక్తులై మోక్షాన్ని పొందుతారు.

      ఓం నమః శివాయ
      VMN

శివోహం

పుట్టుకలోంచి.....
బతుకులోకి....

బతుకులోంచి 
చింతనలోకి
 
చింతనలోనుంచి
చితిలోకి జీవితం అంటే ఇదేనా తండ్రి...

అయితే అలాంటి జీవితం నాకు వద్దు....
నిన్ను స్మరించి తరించి పోయే జీవితం కావాలి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

సృష్టి రహస్య విశేషాలు

1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది

2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది

3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి

( సృష్ఠి )  ఆవిర్బావము

1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాదం
4  నాదం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  అగ్ని యందు జలం
16  జలం యందు పృద్వీ.
17 పృద్వీ యందు ఓషధులు
18  ఓషదుల వలన అన్నం
19  ఈ అన్నము వల్ల నర మృగ  పశు  పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.


( సృష్ఠి ) కాల చక్రం

పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.
ఇప్పటివరకు ఏంతో మంది శివులు  ఏంతోమంది విష్ణువులు  ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
నాలుగు యుగలకు 1 మహయుగం.
71 మహ యుగలకు 1మన్వంతరం.
14 మన్వంతరాలకు ఒక సృష్ఠి ఒక కల్పం.
15 సందులకు ఒక ప్రళయం ఒక కల్పం
1000 యుగలకు బ్రహ్మకు పగలు సృష్ఠి . 
1000 యుగాలకు ఒక రాత్రి  ప్రళయం.
2000 యుగాలకు ఒక దినం.
బ్రహ్మ వయస్సు 51 సం.
ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవారహ యుగంలో ఉన్నాం.

5 గురు భాగన కాలంకు 60 సం
1 గురు భాగన కాలంకు 12 సం
1 సంవత్సరంకు 6 ఋతువులు.
1 సంవత్సరంకు  3 కాలాలు.
1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
1 సం. 12 మాసాలు.
1 సం.  2 ఆయనాలు
1సం. 27 కార్తెలు
1 నెలకు 30 తిధులు
27 నక్షత్రాలు - వివరణలు
12 రాశులు
9 గ్రహాలు
8 దిక్కులు
108 పాదాలు
1 వారంకు 7 రోజులు
పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.

సృష్ఠి యవత్తు త్రిగుణములతోనే ఉంటుంది

అన్ని  జీవులలో మూడే గుణములు ఉంటాయి

1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

( పంచ భూతలు  )

1  ఆకాశం
2 వాయువు
3  అగ్ని
4  జలం
5  భూమి 
.
5  ఙ్ఞానింద్రియంలు
5  పంచ ప్రాణంలు
5  పంచ తన్మాత్రలు
5  ఆంతర ఇంద్రియంలు
5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు

 ఆకాశ పంచికరణంలు

ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( అహంకారం ) పుడుతున్నాయి

వాయువు పంచికరణంలు

వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.

అగ్ని పంచికరణములు

అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టేను.

 జలం పంచికరణంలు

జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టేను.

 భూమి పంచికరణంలు

భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టేను.

( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానింద్రియంలు

1  శబ్ద
2  స్పర్ష
3  రూప
4  రస
5  గంధంలు.

5  (  పంచ తన్మాత్రలు )

1  చెవులు
2  చర్మం
3  కండ్లు
4  నాలుక
5  ముక్కు

5  ( పంచ ప్రాణంలు )
,
1  అపాన
2  సామనా
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యాన

5  (  అంతఃర ఇంద్రియంలు  )  5  (  కర్మఇంద్రియంలు )
,
1  మనస్సు
3  బుద్ది
3  చిత్తం
4  జ్ఞానం
5  ఆహంకారం
.
1  వాక్కు
2  పాని
3  పాదం
4  గుహ్యం
5  గుదం

6  (  అరిషడ్వర్గంలు  )
,
1  కామం
3  క్రోదం
3  మోహం
4  లోభం
5  మదం
6  మచ్చార్యం

3  (  శరీరంలు  )

1  స్థూల  శరీరం
2  సూక్ష్మ  శరీరం
3  కారణ  శరీరం
.
3  (  అవస్తలు  )

1  జాగ్రదవస్త
2  స్వప్నవస్త
3  సుషుప్తి అవస్త
.
6  (  షడ్బావ వికారంలు  )

1  ఉండుట
2  పుట్టుట
3  పెరుగుట
4  పరిణమించుట
5  క్షిణించుట
6  నశించుట

6  (  షడ్ముర్ములు  )

1  ఆకలి
2  దప్పిక
3  శోకం
4  మోహం
5  జర
6  మరణం

7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  )

1  చర్మం
2  రక్తం
3  మాంసం
4  మేదస్సు
5  మజ్జ
6  ఎముకలు
7  శుక్లం

3  (  జీవి త్రయంలు  )

1  విశ్వుడు
2  తైజుడు
3  ప్రఙ్ఞాడు

3  (  కర్మత్రయంలు  )

1  ప్రారబ్దం కర్మలు
2  అగామి  కర్మలు
3  సంచిత  కర్మలు

5  (  కర్మలు  )

1  వచన
2  ఆదాన
3  గమన
4  విస్తర
5  ఆనంద

3  (  గుణంలు  )

1  సత్వ గుణం
2  రజో గుణం
3  తమో గుణం

9  (  చతుష్ఠయములు  )

1  సంకల్ప
2  అధ్యాసాయం
3  అభిమానం
4  అవధరణ
5  ముదిత
6  కరుణ
7  మైత్రి
8  ఉపేక్ష
9  తితిక్ష

10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  )

1  ఆకాశం
2  వాయువు
3  ఆగ్ని
4  జలం
5  భూమి

14  మంది  (  అవస్థ దేవతలు  )

1  దిక్కు
2  వాయువు
3  సూర్యుడు
4  వరుణుడు
5  అశ్వీని దేవతలు
6  అగ్ని
7  ఇంద్రుడు
8  ఉపేంద్రుడు
9  మృత్యువు
10  చంద్రుడు
11  చతర్వకుడు
12  రుద్రుడు
13  క్షేత్రజ్ఞుడు
14  ఈశానుడు

10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  )

1  ఇడా నాడి
2  పింగళ
3  సుషుమ్నా
4  గాందారి
5  పమశ్వని
6  పూష
7  అలంబన
8  హస్తి
9  శంఖిని
10  కూహు
11  బ్రహ్మనాడీ

10  (  వాయువులు  )

1  అపాన
2  సమాన
3  ప్రాణ
4  ఉదాన
5  వ్యానా

6  కూర్మ
7  కృకర
8  నాగ
9  దేవదత్త
10  ధనంజమ

7  ( షట్ చక్రంలు  )

1  మూలాధార
2  స్వాదిస్థాన
3  మణిపూరక
4  అనాహత
5  విశుద్ది
6  ఆఙ్ఞా
7  సహస్రారం

(  మనిషి  ప్రమాణంలు  )

96  అంగళంలు
8  జానల పొడవు
4  జానల వలయం
33 కోట్ల రోమంలు
66 ఎముకలు
72 వేల నాడులు
62  కీల్లు
37  మురల ప్రేగులు
1  సేరు గుండే
అర్ద సేరు రుధిరం
4  సేర్లు మాంసం
1  సరేడు పైత్యం
అర్దసేరు శ్లేషం

(  మానవ దేహంలో 14 లోకలు  )  పైలోకలు 7

1  భూలోకం  -  పాదాల్లో
2  భూవర్లలోకం  -  హృదయంలో
3  సువర్లలోకం  -  నాభీలో
4  మహర్లలోకం  -  మర్మంగంలో
5  జనలోకం  -  కంఠంలో
6  తపోలోకం  -  భృమద్యంలో
7  సత్యలోకం  -  లాలాటంలో

అధోలోకలు  7

1  ఆతలం  -  అరికాల్లలో
2  వితలం  -  గోర్లలో
3  సుతలం  -  మడమల్లో
4  తలాతలం  -  పిక్కల్లో
5  రసాతలం  -  మొకల్లలో
6  మహతలం  -  తోడల్లో
7  పాతాళం  -  పాయువుల్లో

(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )

1  లవణ సముద్రం  -  మూత్రం
2  ఇక్షి సముద్రం  -  చేమట
3  సూర సముద్రం  -  ఇంద్రియం
4  సర్పి సముద్రం  -  దోషితం
5  దది సముద్రం  -  శ్లేషం
6  క్షిర సముద్రం  -  జోల్లు
7  శుద్దోక సముద్రం  -  కన్నీరు

(  పంచాగ్నులు  )

1  కాలగ్ని  -  పాదాల్లో
2  క్షుదాగ్ని  -  నాభీలో
3  శీతాగ్ని  -  హృదయంలో
4  కోపాగ్ని  -  నేత్రంలో
5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో

7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )

1  జంబు ద్వీపం  -  తలలోన
2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
3  శాక ద్వీపం  -  శిరస్సుప
4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
5  పూష్కార ద్వీపం  -  గోలమందు
6  కూశ ద్వీపం  -  మాంసంలో
7  కౌంచ ద్వీపం  -  వేంట్రుకల్లో

10  (  నాధంలు  )

1  లాలాది ఘోష  -  నాధం
2  భేరి  -  నాధం
3  చణీ  -  నాధం
4  మృదంగ  -  నాధం
5  ఘాంట  -  నాధం
6  కీలకిణీ  -  నాధం
7  కళ  -  నాధం
8  వేణు  -  నాధం
9  బ్రమణ  -  నాధం
10  ప్రణవ  -  నాధం

Thursday, March 4, 2021

శివోహం

ఉన్నది శివమే
ఉండేదీ శివమే
ఆదీ అంతమూ లేనిది శివమే
శివనామనౌకలో పయనించేవారికి సుఖసంతోషాలే సర్వసంపదలు....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...