Monday, March 15, 2021

శివోహం

శంభో!!!
ఏ కోరిక కొరకు నిన్ను...
నా సర్వం నివైతే...
నాలో ఉన్న అహమనే మృగాన్ని వధించి
నీ నామమును నాకు సోహం గా ప్రసాదించు చాలు...

మహాదేవా శంభో శరణు...

Sunday, March 14, 2021

శివోహం

శివ!!!మనిషిలా ఎందుకు పుట్టించావు నాకు ..
నీటిలోని ప్రతిబింబం లాగా నో లేక నీటి మీది గాలి బుడగలగా పుట్టిస్తే బాగుండు కదా శివయ్య...

 పలకరింపు లాంటి బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోయేదేమో నేను...

ఇక ఈ జన్మనైన సరి చేయవయ్య నీ కుడికల తీసివేతలతో....

మహాదేవా శంభో శరణు...

ఓం

నిజమైన భక్తి ఎలా ఉంటుంది?

పూజలు, వ్రతాలు నోములు చేయటం భక్తి కాదు. భక్తి సాధనాలు, భక్తిని సాధించటానికి వంటపట్టించుకోటానికి చేసే అభ్యాసాలు అభిషేకాలు, ఆరాధనలు, అర్చనలు, నైవేధ్యాలు, ఉపవాసాలు, పారాయణాలు జాగరణలు భక్తి కాదు. అవి కూడా భక్తి సాధనకు ఉపయోగడే సాధనాలు. ఉపకరణాలు. సాధారణంగా, స్థూలంగా మనం రెండూ ఒకటే అనుకుంటుంటాం. అనుకుంటున్నాం.
భక్తి అంటే ఏమిటి? భగవంతుడ్ని ప్రేమించటం భక్తి. భగవంతుడి కోసం అర్రులు చాచటం భక్తి. ఆరాట పడటం భక్తి. భగవంతుని కోసం ఏడ్వటం భక్తి. బాధ పడటం భక్తి. భగవంతుడికి అన్నీ ఆర్పణ చేయటం భక్తి. కష్టంలోను, కన్నీళ్లలోను, బాధలలోను ప్రతి స్థితిలోను ప్రతీ పరిస్థితిలోను, ప్రతి అవస్థలోను వ్యవస్థలోను, అన్నిటిలోను, అంతటిలోను భగవంతుడ్ని చూడగలగటమే భక్తి. అనుక్షణం ప్రతిక్షణం అనువణువునా ఆ భగవంతుడ్ని హృదయంలో ఉంచుకోగలగటం భక్తి. భగవంతుడి కోసం వేదన పడటం భక్తి. రోదన చేయటం, భగవంతుడ్ని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి.

Saturday, March 13, 2021

ఓం

భక్తి అంటే ఏమిటి? భక్తి ఎలా ఉండాలి?

తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటాం. బిగ్గరగా మంత్రాలు పఠించడం, పూజలు, పునస్కారాలు చేయడం, జపాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తాము అనుకున్నది సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇంకొంతమంది కోరిన కోర్కెలు నెరవేరడానికి భగవంతుడి మెప్పు పొందేందుకు ఉపవాసాలు ఉంటుంటారు, పలు రకాల వ్రతాలూ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది భక్తులు గంటలకొద్దీ పూజలు, వేలకొద్దీ జపాలు, అనేక వ్రతాలు, ఉపవాసాలూ చేసినా ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవడంతో నిరాశపొందడం జరుగుతుంది.

భగవంతుడిని ఆరాధించే కొద్ది సేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా పేర్కొంటారు. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.

శివోహం

ఉఛ్వాస నిశ్వాసలు అనే రెండు ఊపిరుల నడుము నా తోడు నీవే కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Friday, March 12, 2021

శివోహం

నీవెంత దూరంలో ఉన్నా నీ చెంతనే నిలబడి నిన్ను ప్రార్ధిస్తున్నాను....
పరమేశ్వరా నీవే నాకు పెన్నిధి...
వీడను నీ సన్నిధి....

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

అమ్మ

నీవే సమస్త జగత్తుకు మూలకారణం తల్లి...
నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః...
ఓం నమః శివాయ..

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...