Thursday, March 25, 2021

శివోహం

త్రినేత్రమును దాచే రేఖలివి...
ఆరేఖల అనుగ్రహమున ఆదృష్టి...
అంతరములో పయనింపచేసిన తేజముతో నుదుటి గీతల రాత...
ఏదైనా తనివితీరా అనుభవించే...
తీరున తనువు మారుతుంది శివా...
నామనో నేత్రమును నీవిబూధి రేఖలతో బలీయము చేయవా...
నీతత్వమే నాకు సంపదగా బహూకరించవా మహేశ్వరా...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

సర్వకాల ..
సర్వావస్థల్లో...
నాతోడు వుండే...
నా సన్నిహిడు...
స్నేహితుడు...
నా స్వామి ఒక్కడే...
నా స్వామి ని మించిన ఆప్తుడు, స్నేహితుడు నాకు
ఈ ధరాతలంలో మరియొకరు లేరు...

ఓం శివోహం... సర్వం శివమయం

జై శ్రీరామ్

హనుమ!!!
నీ మనసు మానవ సరోవరం....
నీ తేజస్సు హిమాలయం....
నీ రూపం రుద్రరూపం...
నీ శౌర్యం ప్రభాదివ్యకావ్యం....
నీ నామస్మరణ సర్వ దుఃఖ పరిహారం... 

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఓం కారేశ్వర...
ఉమామహేశ్వర...
రామేశ్వర...
త్రయంబకేశ్వర...
మహాబలేశ్వర...
మహాకాళేశ్వర...
ముక్తేశ్వరయా
నమః శివాయ నమః

Tuesday, March 23, 2021

ఓం

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా ! సమస్త సంపదలను మరియు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను అనుగ్రహించు జగన్మాతకు నమస్కారము.

జగన్మాత అష్టలక్ష్మీ స్వరూపిణి. భక్తులకు కేవలం పాడిపంటలు, సిరిసంపదలు మాత్రమేగాక ఒక గృహస్థుకు కావలసిన విద్య, ఆరోగ్యము, కష్టములనెదుర్కొనే ధైర్యము, వంశాభివృద్ధి (సంతానము), పాడిపంటలు, తలచిన ధర్మకార్యములందు విజయము, వస్తువాహనములను మరియు ధర్మార్థకామములను పురుషార్థములకు అనుగుణంగా, పూర్వజన్మ కర్మఫలము ననుసరించి   అనుగ్రహించు అష్టలక్ష్మీ స్వరూపిణి. 

*శ్రీ* అంటే సంపదమాత్రమేకాదు. సర్వ శుభకరం. సర్వ మంగళకరం. మనకు కావలసింది అదేకదా. సిరిసంపదలు, వస్తువాహనములు, పాడిపంటలకు లోటు లేకున్నప్పటికిని అందరూ సంతోషంగా ఉండాలి. దుఃఖకరమైనది ఏదియు సంభవింపకూడదు. ఏదైనా పని చేయునప్పుడు *శ్రీ* కారం చుట్టాము అంటాము. అంటే తలపెట్టిన కార్యము శుభకరము గాను, మంగళకరముగాను జరగాలనే భావనేకదా ఈ *శ్రీకారం* చుట్టాము అని అనడంలోని అంతరార్థము. శ్రీకారం చుట్టామంటేనే సర్వమంగళకారిణి అయిన జగన్మాతను తలచినట్లేగదా. అందుకు ఆ తల్లి తలచిన పనులు అవిఘ్నముగా, సర్వశుభకరముగా సిద్ధింప జేయును.

*అష్టలక్ష్ములు*

1) ఆదిలక్ష్మి, 2) ధాన్యలక్ష్మి, 3) ధైర్యలక్ష్మి, 4) గజలక్ష్మి, 5) సంతాన లక్ష్మి, 6) విజయలక్ష్మి, 7) విద్యాలక్ష్మి, 8) ధనలక్ష్మి.

స్వామి శరణం

అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
కంఠం లో మెరిసే నవరత్న మణి హారాలతో...
చెవులకు కుండలాలతో....
తెల్లని పలువరస తో దగ దగా మెరిసే...
అయ్యప్పను జూడని కన్నులు కన్నులే కాదు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

అమ్మ

అజ్ఞాన అంధ వినాశ కారిణి
మమ్ము ఆదరింపు మాత...
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు...
ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము...
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ...
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ...

అమ్మ దుర్గమ్మ శరణు...
ఓం శ్రీ దుర్గాదేవినే నమః

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...