Sunday, April 4, 2021

శివోహం

శివుడంటే ఆలోచన...
శక్తంటే ఆచరణ...
ఈ రెండూ విడదీయరానివి...
ఆలోచన లేని ఆచరణ...
ఆచరణ లేని ఆలోచన లోకానికి అవసరం లేదు...
కనుక, ఈ రెండిటి సమన్వయధార, శ్రీవిద్యాస్వరూపంగా, యోగత్రయ శక్తిగా, శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు.  శ్రీవిద్య ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా, కవితాగానం చేస్తూ అమృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద-సౌందర్యలహరిని.. గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి నుండి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకమును సృష్టిస్తున్నాడు.
ఒక్క శిరసుతో ఆ రేణువును మోయలేని విష్ణువు, పదివేల శిరసులున్న శేషుడై మోయగలుగుతున్నాడు. పరాగ రేణువును చూర్ణము చేసి, విభూదిని ధరించి శివుడు లయకార్యమును నిర్వహిస్తున్నాడు.
ఈ ముగ్గురూ తమ శక్తులను ఆమె పాదపద్మ పరాగ రేణువు నుండి గ్రహిస్తున్నారు. ‘సౌందర్యలహరి’ ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలున్నాయి. అదొక తీవ్ర విచారణ!

శంకర భగవత్పాదులు లలితా సహస్ర నామ స్తోత్రానికి భాష్యం రాయలేదు. ‘సౌందర్యలహరి’ని రచించి ఆ లోటును పూరించారు.
లలితా సహస్రనామ స్తోత్రానికి సౌందర్యలహరి, శ్లోకరూపంలో ఉన్న భాష్యమే! అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితామృతం రుచి ఎరిగి, మరిగి, అనల్పకల్పనా శక్తి కలిగి శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలున్నవారికి సౌందర్యలహరి, నిజానికి అసలు విద్య.
అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయుల్లో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం సాధించుకోవాలి. దేశ, కాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిద్‌ఫలం, సౌందర్యలహరి

శివోహం

నీవు నన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు...
కానీ అహంకారాల హాహాకారలతో...
వినిపించుకోలేని వెఱ్ఱివాడిని నేను...
ఓపట్టు పట్టు పరమేశ్వరా....
మహాదేవా శంభో శరణు

Saturday, April 3, 2021

శివోహం

నేడు నిన్నగా లేకపాయే
రేపు నేడుగా మారదాయే
మరి ముందు గురించి 
చింత యేల,ఎవరిని ఎంచ్చక
నీ నామమే మాకింక శరణు

అపద్బాంధవా అనాధ రక్షకా శరణు...
వెంకటేశ్వరా శరణు..
గోవిందా గోవిందా గోవిందా

శివోహం

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ
రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి
రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను
రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట
రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు
రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు
రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ

శివోహం

సర్వం శివమయం జగత్....
చరాచర ప్రపంచం అంతా శివమయం...
ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు...
ఈ సమస్త సృష్టి పంచభూతాలతో నిండి వుంది అనడానికి ఇది ఉదాహరణ...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

మనలో ఉండే అజ్ఞానం, అహంభావాల వైపు చూడనంత కాలం భగవంతుని వైపు చూసినా, ఆయనను ప్రార్థించినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. అసలు అది ప్రార్థన కానే కాదు. కేవలం ఒక ఏక పాత్రాభినయం మాత్రమే!. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా ఎన్ని పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేస్తూ ఏదో ప్రయోజనాన్ని ఆశించడం అత్యాశే! ఇది ఒక వృథా ప్రయత్నం. మనసులోని భావాలను శుద్ధి చేసుకుంటే తప్ప భగవంతుని అనుగ్రహం పొందుటకు వీలు పడదు....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

మనలో ఉండే అజ్ఞానం, అహంభావాల వైపు చూడనంత కాలం భగవంతుని వైపు చూసినా, ఆయనను ప్రార్థించినా పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. అసలు అది ప్రార్థన కానే కాదు. కేవలం ఒక ఏక పాత్రాభినయం మాత్రమే!. మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా ఎన్ని పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేస్తూ ఏదో ప్రయోజనాన్ని ఆశించడం అత్యాశే! ఇది ఒక వృథా ప్రయత్నం. మనసులోని భావాలను శుద్ధి చేసుకుంటే తప్ప భగవంతుని అనుగ్రహం పొందుటకు వీలు పడదు....

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...