Friday, April 30, 2021

శివోహం

పదములకే పేదవాడను
హృదయమున నిన్నే ఆరాధించే ధనికుడను
నీ నామస్వరమే నా ఆదాయం
ఈజన్మనెలా గెంటేసినా
మరుజన్మనైనా నీసన్నిధిలో ఇలా
నవ్వుతూ బ్రతికే వరానీయవా శివా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

చంద్రబింబానన చంద్రరేఖామౌళి
నీలకుంతలభార నీలగళుడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు
మదన సంజీవనీ మదనహరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండలధారి
భువన మోహన గాత్రి భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు
సర్వాంగ సుందరి సర్వగురుడు
గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న
పాదుకల మెట్టి చట్టలు పట్టి కొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసకమెసగ
విహరణ క్రీడ మాయున్నవేది కపుడు

శ్రీనాథుడు భీమఖండం కూర్చిన చక్కటి పద్యం....

Thursday, April 29, 2021

అమ్మ

సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం మైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరించడం ఎంతో శుభకరమని  మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం.  ఈ నెలంతా ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపులే దర్శనమిస్తాయి. అమ్మవారిని  భక్తిశ్రద్దలతో నిండు మనసుతో  పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం.

శివోహం

సమస్తమైన చరాచరప్రకృతిని....
తోలుబొమ్మలాడించే నీవు...
నా కన్నుల మాయను కప్పేస్తావు...
రంగుల కలలే రప్పిస్తావు...
ఎంతటి ఇక్కట్లు పెట్టితివి శంకరా....
అసలే సంసారం బంధమున మునిగి ఉన్న....
ఇంకా నన్ను ముంచబోకు...
నన్ను నీ నుండి దూరం చేయబోకు...

మహాదేవా శంభో శరణు......

శివోహం

భారముగా గడుపు చుంటిని పాపినై నేను....
తీరని భవ బంధముల కారాగారములో....
నేరము లెంచక కోరికలన్నీ.....
తీరెడి కారాగారమ్ము నుండి రక్షించు.....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

పార్వతి పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు....
అన్యోన్య దాంపత్యనికి ఆదర్శ మూర్తులు...
పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే...
అమ్మ వారు విజయాన్ని చేకూరుస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, April 28, 2021

శివోహం

ఈ పాపాపుణ్యాలు నాకు తెలియదు
జ్ఞానం ఏందో అజ్ఞానం ఏందో అసలే తెలియదు...
నాకు తెలిసిందల్లా నీ నామ స్మరణే...
ఆ పై నీ దయ,  శంభో శరణు....

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...